‘scienceforpeople.in’కు ఆహ్వానం...
Share
విజ్ఞానవీచిక డెస్క్
Wed, 26 Aug 2009, IST
విజ్ఞానశాస్త్రంలో అభిరుచి గల వారి సౌలభ్యం కోసం
ఇప్పుడు ‘scienceforpeople.in’ వెబ్ పేజీ ఏర్పాటయింది. ఈ సైట్‌లో
సైన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఒకేచోట దొరుకుతుంది. దీని ప్రధాన
ఉద్దేశం విజ్ఞానశాస్త్రాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే. అయితే
విజ్ఞానం విజ్ఞానం కోసం కాకుండా సామాన్యుల జీవితాలపై విజ్ఞానశాస్త్రం
చూపించగలిగే ప్రభావాల్ని గురించి ఆలోచింపజేయడం దీని లక్ష్యం. మామూలు వెబ్
సెర్చ్‌లో బిలియన్ల వ్యాసాలు కుప్పగా వస్తాయి. కానీ అవసరమైన వాటిని ఎంపిక
చేసుకోవడం పెద్ద సమస్య. ఈ వెతకడాన్ని ఈ వెబ్‌సైట్ సులభతరం చేసింది. మీ
అభిప్రాయాలనూ తెలపవచ్చు. ఇతరుల అభిప్రాయాలనూ తెలుసుకోవచ్చు. మీకు అభిరుచిగల
టాపిక్స్‌ను సూచించవచ్చు. మీ ప్రత్యేక వ్యాసాలను దీనికి అనుసంధానించవచ్చు.
ముఖ్యంగా, జనవిజ్ఞాన వేదికలాంటి శాస్త్రీయ దృక్పథంగల వారందరికీ ఇదెంతో
ఉపయోగం. ఈ సైట్‌ను పరిపుష్టం చేయడానికి మీ భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది.
No comments:
Post a Comment