నీటిపై తేలియాడే రాళ్లు ఉంటాయా?
-
ఎందుకని? ఇందుకని!
- సుమతి, నల్గొండ
తులసీ రామాయణం, కంద రామాయణం గ్రంథాల్లో నలుడు, నీలుడు అనే వానర సాంకేతికులు నీటిపై 'తేలియాడే' రాళ్లతో రామసేతును నిర్మించినట్లు ప్రస్తావన ఉంది. నీటి సాంద్రత కన్నా తక్కువ సాంద్రత ఉన్న వస్తువేదైనా నీటిపై తేలుతుందని ప్లవనసూత్రాలు (laws of floatation చెబుతున్నాయి. పైగా సముద్రపు నీటి సాంద్రత సాధారణ నీటి సాంద్రత కన్నా ఎక్కువ కాబట్టి మామూలు సరస్సులో మునిగే రాళ్లు కూడా కొన్ని సముద్ర ఉపరితలంపై తేలియాడే అవకాశం ఉంది. ప్రస్తుతం రామేశ్వరం, శ్రీలంక మధ్య సముద్రపు పీఠంపై ఉండే 'ఆడమ్స్ బ్రిడ్జి'ని రామసేతుగా కొందరు విశ్వసిస్తున్నారు. దానిపై విభిన్నమైన వాదనలు ఉన్నాయి.
అయితే నీటిపై తేలియాడే రాళ్లు లేకపోలేదు. కృత్రిమంగా తయారుచేసే రాళ్లల్లో గాలి బుడగలు ఎక్కువ ఉండేలా సరంధ్రీకరణం (porosity)చేసినట్ల యితే అలాంటి రాళ్ల నికర సాంద్రత (net density)) నీటి సాంద్రతకన్నా తక్కువగా చేయవచ్చును. సముద్ర కోరల్స్, అగ్నిపర్వతాల లావా ఎండిపో యిన తర్వాతా అవి నీటిపై తేలియాడే లక్షణాల్ని సంతరించుకొంటాయి. ఇంతవరకు శాస్త్రానికీ, విశ్వాసానికీ పేచీ లేదు. కానీ మునిగేరాళ్లను ఎవరు తాకితే వాటికి తేలియాడే లక్షణాలు అమాంతం వచ్చినట్లుగానూ, లేదా రాళ్లపై 'శ్రీరామ' అని రాస్తే వాటికి ఉన్నఫళాన తేలియాడే లక్షణాలు సమకూరినట్లు భావిస్తే అది కేవలం విశ్వాసం అవుతుందిగానీ సైన్సు కాదు.
సరస్సులు, నదులు కొన్ని దేశాల్లో శీతాకాలంలో గడ్డ కట్టినా కిందిభాగంలో నీరు ద్రవరూపంలోనే ఉంటుందట. అదెలా సాధ్యం? అక్కడ జలచరాలకు కావలసిన ఆక్సిజన్ ఎలా లభిస్తుంది?
- దివ్య, జగిత్యాల
ఘనీభవించిన నీటి (ఱషవ) కన్నా ద్రవస్థితిలో ఉన్న నీటికి సాంద్రత (సవఅరఱ్y) ఎక్కువ. నీటికున్న ఒక అసంగత లక్షణం(anomalous character) ) ఇది. సాధారణంగా ఓ పదార్థం ఘనస్థితిలో ఉన్నప్పుడు అందులోని అణువులు లేదా పరమాణువుల దగ్గరికి చేరుకోవడం వల్ల ద్రవం కన్న ఘనపు ((solid)) సాంద్రత ఎక్కువ ఉంటుంది. కానీ నీటి విషయంలో ఇది విరుద్ధం. ఐసుగడ్డ సాంద్రత ద్రవనీటి సాంద్రత కన్నా తక్కువ. అందువల్లే ఐసుగడ్డలు నీటిపై తేలియాడుతూ ఉంటాయి.
ఐసుకన్నా నీటికి సాంద్రత ఎక్కువ కాబట్టి ఐసుగడ్డల మీద వత్తిడి (pressure)) కలిగిస్తే అది ద్రవంగా మారుతుంది. మీరు ఐసుగడ్డపై స్పూనులు నొక్కిపట్టినట్లయితే స్పూను కింది భాగంలో ఉండే ఐసు భాగం ద్రవీకరించడాన్ని గమనించవచ్చును. దీనర్థం ఏమిటంటే వత్తిడికి లోనయిన నీరు సాధారణ నీరు ఘనీభవించే ఉష్ణోగ్రత ((freezing temperature) వద్ద కూడా ద్రవస్థితిలోనే ఉండగలదు.
పైభాగం ఘనీభవించడం వల్ల కొన్ని సరస్సుల్లోను, నదుల్లోనూ కింద వైపున్న నీరు పైనున్న ఐసుగడ్డ బరువును మోస్తున్నట్టే అర్థం. అంటే కిందున్న నీరు వత్తిడికి లోనయి ఉంది. అందువల్ల పైభాగం ఘనరూపంలో ఉన్నా అదే ఉష్ణోగ్రత దగ్గర కింది నీరు ద్రవ (శ్రీఱనబఱస) రూపంలోనే మనగలదు. పైనున్న ఐసుగడ్డ కాంతి, పారదర్శకమే (transparent)). కాబట్టి సూర్యకాంతి కిందున్న నీటిని చేరగలదు. నీటి అడుగుభాగాన ఉన్న ఆల్గే, ప్లాంక్టెయిన్, తదితర పచ్చని వృక్షజాతులు యథావిధిగా కిరణజన్య సంయోగక్రియ ((photo synthesis) జరపగలవు. ఆ క్రియలో వదిలిన ఆక్సిజన్‌ను సేవించి అక్కడున్న వృక్ష జాతులు కొంతకాలం బతగ్గలవు.
బరువుకు ఏదైనా కుంగిపోతుంది. భూమి దేనిపై ఆధారపడి ఉంది? ఇంత బరువున్న భూమి వత్తిడికి ఆ ఆధారం కుంగిపోదా?
- జె.సుధీర్‌కుమార్, వరంగల్
అంతరిక్ష వస్తువులు cosmic bodies) ఏవీ ఎవరి మీదా ఆధారపడిలేవు. అవి స్వతహాగా శూన్య బలస్థావరాల (weightless mass zones) లో ఉన్నాయి. ఎందుకంటే వాటిపైన నికర బలాలు (resultant forces) ఏమీలేవు. కాబట్టి భూమి ఎక్కడయినా కుంగిపోతుందన్న భయంతో ఎవరూ మానసికంగా కుంగిపోనవసరం లేదు. భూమికి ద్రవ్యరాశి (సుమారు 6×1024 కి.గ్రా.) ఉందిగానీ బరువు లేదు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
1 comment:
THANK U SIR.................. ITS VERY GOOD...... GANGA
Post a Comment