నివాస యోగ్యమైన నాలుగో గ్రహం
Share
విజ్ఞాన వీచిక డెస్క్
Wed, 8 Feb 2012, IST
మన సౌర కుటుంబం ఆవల మరో నివాస యోగ్యమైన గ్రహం ఉన్నట్టు
పరిశోధకులు పసిగట్టారు. దీనితో ఇప్పటికి అటువంటి గ్రహాలు నాలుగు లభించాయి. ఈ
తాజా గ్రహం మనకి 22 కాంతి సంవత్సరాల దూరాన ఉంది. ఈ కొత్త గ్రహం జిజె 667సి
అనే నక్షత్రం పరిధిలో ఉంది. ఆ నక్షత్రం మన సూర్యుని కంటే తక్కువ వేడిని
విడుదల చేస్తుంది. దానిచుట్టూ కనీసం మూడు గ్రహాలు సమీపంగా
పరిభ్రమిస్తున్నాయి. వాటిలో ఒకదానిపై మన భూమి మీద పడినంత వేడి, కాంతి
ఉన్నట్టు తెలిసింది. కొత్తగా కనుగొన్న శిలాయుత గ్రహానికి జిజె 667సి అని
పేరు పెట్టారు. దానిమీద సంవత్సరానికి 28.15 రోజులేనట! ఈ గ్రహం మీద బహుశా
నీరు కూడా ఉండే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. కానీ మరిన్ని పరిశోధనల
తరువాతగానీ ఆ విషయం నిర్ధారణ కాదు.
No comments:
Post a Comment