చేసిన కృషి.. గుర్తింపు..
'ప్రజల కోసం సైన్స్.. శాంతి కోసం సైన్స్.. ప్రగతి కోసం సైన్స్.. నిజం కోసం సైన్స్... స్వావలంబన కోసం సైన్స్..' వంటి నినాదాలను ప్రచారంలో పెట్టింది. తద్వార నిత్యజీవితంలో విజ్ఞానశాస్త్ర ప్రాధాన్యత ప్రజలచే గుర్తించడానికి కృషి చేసింది. జాతీయ శాస్త్ర, సాంకేతిక సంస్థలతో కలిసి జనవిజ్ఞాన వేదిక విద్య, వైద్య, విజ్ఞానశాస్త్ర ప్రచారాలను పెద్దఎత్తున చేపట్టింది. గ్రామ, మండల, జిల్లా స్థాయి మొదలుకొని, రాష్ట్రస్థాయి వరకూ అభివృద్ధిని ఆటంకపరుస్తున్న సమస్యలను గుర్తిస్తూ పరిష్కారానికి కృషి చేసింది. ముఖ్యంగా మహిళలకు గల హక్కుల్ని గుర్తింప జేస్తూ, వారిని స్వశక్తీకరించింది. సాంఘిక రంగంలో 'సమతా విభాగం' పేర కృషి చేస్తుంది. ఈ వేదిక చేస్తున్న 'ఎనలేని సేవలకు' గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగాల నుండి 2005 'జాతీయ అవార్డు'ను పొందింది. 25వ సంవత్స రంలోకి అడుగిడుతూ 'రజితోత్సవాల'ను జరుపుకుంటున్న జనవిజ్ఞానవేదిక 50 వేలకు పైగా సభ్యత్వం కలిగి ఉంది. ప్రధానంగా ఉపాధ్యాయులు, వైద్యులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ప్రజాసైన్స్ ఉద్యమాభిలాషులు ఎందరో దీనిలో సభ్యులుగా ఉన్నారు.
No comments:
Post a Comment