మనదేశంలో..
Share
విజ్ఞాన వీచిక డెస్క్
Wed, 5 Oct 2011, IST
అరుదైన
లోహాల తయారీకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ (ఇండియన్ రేర్ ఎర్త్స్
లిమిటెడ్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ లోహాల ఉత్పత్తి 2003
వరకూ వాణిజ్యపరంగా కొనసాగింది. కానీ ఆర్థిక కారణాల రీత్యా 2004లో వీటి
తయారీని నిలిపివేసింది. చైనా ఎగుమతులను తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో
వీటి ధరలు, గిరాకీ కూడా బాగా పెరిగాయి. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందువల్ల
అరుదైన లోహాలను మన దేశంలో ఉత్పత్తి చేయమని జపాన్ కూడా కోరింది. ఫలితంగా,
2011 నుంచి ఈ లోహాల ఉత్పత్తిని పునరుద్ధరించడానికి మనదేశం నిర్ణయించింది.
దీనికనుగుణంగా ఒరిస్సాలో వార్షికంగా ఐదువేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో
ఒక పరిశ్రమను ఏర్పాటు చేసింది. త్వరలో ఇది ఉత్పత్తిని ప్రారంభించనుంది.
స్థానిక అవసరాలను తీర్చడమేగాక, మిగిలిన ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి ఈ
పరిశ్రమ ఉద్దేశించబడింది. మన వార్షిక వాడకం 2004లో 200 టన్నులుగా ఉండేది.
ఎగుమతికి వీలుగా జపాన్‌తో మనదేశం వాణిజ్య ఒప్పందాన్ని కూడా చేసుకుంది.
No comments:
Post a Comment