12 Feb 2012

ఔషధ పరిశ్రమల్లో జీవ వైవిధ్యం

ఔషధ పరిశ్రమల్లో జీవ వైవిధ్యం

ప్రపంచంలో సుమారు అరవై శాతం ప్రజలు ఔషధాల కొరకు మొక్కలపై నేరుగా ఆధారపడుతున్నారు. ఉదాహరణకి చైనీయులు ఐదువేల కంటే ఎక్కువ మొక్కలను (ఇప్పటివరకు గుర్తించిన స్థానిక మొక్కలు ముప్పై వేలు) వైద్యంగా వాడుతున్నారు. అమెరికాలో ఇచ్చే ప్రిస్కిప్షన్లలో నలభై శాతం కంటే ఎక్కువ వాటిలో కనీసం ఒకటి ఫన్జై బాక్టీరియా మొక్కలు జంతువుల మూలాలే. అడవి మొక్కలు, జంతువులు కేవలం ఔషధాలలోనే కాక అనేక ఇతర వాణిజ్యపరమైన ప్రాముఖ్యతలు కూడా కలిగి ఉన్నాయి. టాన్నిన్లు, జిగురులు, తైలాలు, రంగులు వంటి ఉపయోగకర పదార్థాలలో ఇవి వాడబడుతున్నాయి. ఇప్పటివరకు తెలిసిన జీవుల సంగతి అలా ఉంచితే, ఇంకా తెలియని జీవుల ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉంటాయో ఊహించలేము. పైగా మనకి తెలిసిన జీవులనే ఇంకా పూర్తిగా వాడుకోలేదని గమనించాలి. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో మొక్కల నుండి డీజిల్‌ వంటి ఇంధనం రూపొందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి.

బ్రెజిల్‌లో మొక్కజొన్న నుండి మిథేన్‌ తయారుచేసి, కార్లలో వాడుతున్నారు. దీనివల్ల ఖరీదైన ఇంధన తైలాన్ని దిగుమతి చేసుకోనవసరం లేకుండా చాలా విదేశీ మారకం ఆదా చేసుకోవచ్చు. పైగా అంతరించిపోతున్న శిలాజ ఇంధన నిలువలని అడ్డుకోవచ్చు కూడా. చాలా పురాతన కాలం నుండి మానవులు జీవుల జన్యు వైవిధ్యతను ఆధారం చేసుకొని అనేక రకాల పెంపుడు మొక్కలను, జంతువులను రూపొందించారు. వాటివల్ల వ్యవసాయం, అటవీ రంగం, పశుసంవర్థక రంగం, ఆక్వా కల్చర్‌ వంటి కొత్త పరిశ్రమలు, పనులు ప్రారంభించారు. లాభం పొందారు. అలాగే పంటల నష్టాలని తట్టుకునే విధంగా కొత్త వంగడాలని తయారుచేశారు. రాబోయే కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తరిల్లి, ఇప్పటివరకు మనకు తెలియని ఉపయోగాలు కూడా తెలియవచ్చు. కాబట్టి ఇంకా మనం గుర్తించని జీవజాతులను వెంటనే వర్గీకరించడం ప్రారంభించాలి. వాటిలో మన భవిష్యతరాలకు ఆహారం అందించేవి, ప్రాణ రక్షణ కల్పించేవి కూడా ఉండవచ్చు. అందుకే జీవ వైవిధ్యం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
డా|| కాకర్లమూడి విజరు వచ్చే వారం మరో అంశం..

No comments: