HEALTH AWARENESS

జలుబుకు గృహవైద్యం


  • 02/02/2012
వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా జలుబు బారిన పడిన వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబును త్వరితగతిన వదిలించుకోవచ్చు. రాత్రి సమయంలో నిద్ర పోయేముందు పాలు తాగితే జలుబు నుంచి దూరం కావచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరగించి, ఆ తర్వాత ఆ నీటిని శుభ్రమైన వస్త్రంతో వడగట్టి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులు కూడా జలుబును తగ్గించేందుకు దోహద పడతాయి. కొన్ని తులసి ఆకులు, చిటికెడు రాతి ఉప్పు కలిపి రసాన్ని మింగితే మంచి ఫలితం లభిస్తుంది. తులసి ఆకులను ‘టీ’లా మరగించి తాగినా జలుబు నుంచి విముక్తి పొందవచ్చు.
________________________________________________________________________________

ఐడియా


  • 31/01/2012
తలంటుకోడానికి అరగంట ముందు నువ్వుల నూనె చేతిలో వేసుకుని తలకు మర్దనా చేయాలి. కొంతసేపటికి తలలో వేడి బైటకు వచ్చి నూనె మాడులోపలకు ఇంకుతుంది. ఆ తర్వాత కుంకుడుకాయ, సీకాయతో తలస్నానం చేయాలి.
ఉసిరికను, కొద్దిగా మెంతులను వేరు వేరుగా నానబెట్టి మెత్తగా వేరువేరుగా రుబ్బి ముందు మెంతిపిండితో, తరువాత ఉసిరిక ముద్దతో తలరుద్దుకోవాలి. తరువాత గోరువెచ్చని నీళ్ళతో తలంటుకోవాలి.
నిమ్మరసం, కోడిగుడ్డు సొన కలిపి తలకు బాగా మర్దనా చేయాలి. అరగంట అయ్యాక స్నానం చేయాలి. దీనివల్ల కుదుళ్ళు గట్టిపడతాయి. జుత్తు మృదువుగా తయారై మెరుస్తుంటుంది.
వంట చేయటమే కాదు వంట సామాగ్రిని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో స్టీలు, రాగి, ఇత్తడి, అల్యూమినియం సామాన్లు తప్పకుండా ఉంటాయి. ఇనుము, వెండివల్ల ప్రమాదం లేదు గాని, తగరం, సీసం వంటి లోహపు వస్తువులు తినుబండారాలను విషతుల్యం చేస్తాయి. రాగి, ఇత్తడి, అల్యూమినియం పాత్రలో పుల్లటి పదార్థాలను ఉంచకూడదు. ఆహార పదార్థాలు చెడిపోయే అవకాశం ఎక్కువ. స్టీలు, గాజు, పింగాణి, మట్టి, రాగి, చెక్క పాత్రలను ఉపయోగించాలి. రాగి, ఇత్తడి పాత్రలను నీరు నిలువ చేసుకునేందుకు ఉపయోగించాలి. రాగి చెంబులోని నీరు ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.
నిమ్మరసం, చక్కెర కలిపి మోచేతులకు బాగా మర్దనా చేశాక స్నానం చేస్తే మీ చేతి నలుపు విరిగి చర్మపు అసలు రంగు బైటకు వస్తుంది. అలా పది రోజులు స్నానానికి ముందు చేస్తే, చేతులు మృదువుగా, ఆకర్షణీయంగా తయారవుతాయి.
రాత్రి పడుకునే ముందు పుదీనా ఆకు రసం కొద్దిగా ముఖానికి రాసుకుంటే ముఖంపై మొటిమలు తగ్గిపోయి చర్మం మృదువుగా నునుపు తేలి అందంగా ఉంటుంది.
_________________________________________________________________________________

మర్దనతో మరమ్మతు..!

ఒళ్ళు అలసటగా ఉంటే మంచి మర్దన వల్ల కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. కానీ, అసలు మసాజ్‌ వల్ల కొత్త కణాలు పుడతాయంటే ఎలా ఉంటుంది? అది నిజం అని నిరూపించింది ఓ పరిశోధన. ఇప్పటివరకూ కండరాలను మర్దన చేస్తే 'లాక్టిక్‌ ఆమ్లం' పుట్టి ఇబ్బంది కలిగిస్తుందని అనుకునేవారు. కానీ వ్యాయామం పిదప కండరాల మర్దన అనే అంశంపై జరిగిన ఈ మొట్టమొదటి పరిశోధనలో మర్దన మంచిదని తేలింది. అది కండరా లలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే దిశగా రసాయనాల ఉత్పత్తి జరిపి, కొత్త కణాల జననానికి అవసరమైన 'ఎంఆర్‌ఎన్‌ఎ' (మెసెంజర్‌ రైబో న్యూక్లియిక్‌ ఆసిడ్‌) అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఆ ఎంఆర్‌ఎన్‌ఎ కణాల ద్వారా కొత్త ప్రొటీన్ల తయారీకి అవసరమైన సమాచారాన్ని మోసుకెళుతుంది ఆ విధంగా మర్దన కండరాల మరమ్మతుకు తోడ్పడుతుంది

No comments: