ఈశాన్య మూల కర్ర ఉంటే..?
-
విశ్వాసాలు.. వాస్తవాలు...
'అలా ఉంచితే ఏమౌతుందండీ' అని అడిగాను.
'అలా చేయడం వల్ల ఎన్నో ఆర్థిక వైపరీత్యాలు, అనర్థాలు కలగడం అనుభవరీత్యా తేలిన విషయాలు' అని కూడా ఈ గ్రంథంలో రాసి ఉన్నదండీ' అన్నారాయన.
నేను వెంటనే లేచి హాలులోని తలుపును ముందుకు వేసి, 'అయ్యా! తలుపు వెనుక ఈశాన్య మూలలో ఏముందో చూడండీ' అన్నాను.
ఆ మూలన ఒక కర్ర ఉంది. ఆయన ఆశ్చర్యంగా చూడసాగాడు. 'అయ్యా! ఇటురండి' అని ఆయనను పిలిచి ప్రతిగదిలోను ఈశాన్య మూలనున్న కర్రలను చూపించాను. ఆయన మరింత ఆశ్చర్యంతో చూడసాగాడు. వెంటనే 'కాంతారావు గారూ! మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. వాటిని అక్కడి నుండి వెంటనే తీయించండీ' అన్నాడు. నేను నవ్వుతూ 'రామ్మూర్తిగారూ! మేము ఈ ఇంట్లోకి 2006 లో ప్రవేశించాం. అప్పటి నుండి ప్రతిగదిలోనూ ఈశాన్య మూలన ఒక కర్రను ఉంచాను. మా పని అమ్మాయి ఇల్లు ఊడ్చేటప్పుడు అడ్డంగా ఉందని ఏదైనా కర్రను తీసివేయబోతే నేను 'అమ్మా! ఆ కర్రను అక్కడ కావాలనే ఉంచాను. మరల అక్కడే పెట్టు' అని చెప్పాను. ఇప్పటికి ఐదేళ్ళుగా ఆ కర్రలు అక్కడే ఉంటున్నాయి. మాకు ఆర్థికబాధలు గానీ, అనర్థాలుగానీ ఏమీ రాలేదు. 'కాబట్టి ఈశాన్య మూలన కర్రలు కొంచెంసేపైనా ఉంచకూడదనడం అశాస్త్రీయమని రుజువు కావడం లేదా?' అన్నాను.
రామ్మూర్తిగారేం మాట్లాడలేదు.
No comments:
Post a Comment