18 Feb 2012

సెమీకండక్టర్ ‘గురు’ ఇకలేరు


  • 11/02/2012
  •  | 
  • -వి.ఆర్.సి.మూర్తి
    సెమీకండక్టర్ ‘గురు’ ఇకలేరు
మైక్రాన్ టెక్నాజీ సిఇవో స్టీవ్ అపిల్టన్ ఫిబ్రవరి 3న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు.
 సెమీ కండక్టర్స్ టెక్నాజీలో నూతన ఒరవడిని సృష్టించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం
 చుట్టిన స్టీవ్ అపిల్టన్ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 1960 మార్చి
31 కాలిఫోర్నియాలో జన్మించారు. మైక్రాన్ టెక్నాలజీలో 1983లో చిన్న ఉద్యోగంలో
చేరిన అపిల్టన్ అంచలంచలుగా మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఆతర్వాత సిఇవో
స్థానానికి ఎదిగారు. క్లింటన్ హయాంలో అపిల్టన్ ప్రతిభను అమెరికన్ ప్రభుత్వం గుర్తించింది.
స్టేట్ సుప్రీంకోర్టు అడ్వయజరీ కౌన్సిల్ అపిల్టన్‌ను నేషనల్ సెమీకండక్టర్ టెక్నాలజీ కౌన్సిల్
ఎంపిక చేసింది. వరల్డ్ సెమీ కండక్టర్ కౌన్సిల్‌కు కూడా ఆయన ఎంపికయ్యారు. రెండు
పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మైక్రాన్ టెక్నాలజీ సిఇవోగా కంపెనీకి విశిష్టసేవలు
అందించారు. అపిల్టన్ కెరీర్‌లో ఇటు వృత్తి ధర్నాన్ని నిర్వహిస్తూనే ఎప్పటికప్పుడు
పరిశోధనకోసం కొంత సమయం కేటాయించే వాడు. ఈ నేపధ్యంలో ఇన్‌ఫర్మెషన్
టెక్నాలజీ రంగంలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. చివరగా 2011లో రాబర్డ్ నైసీ
అవర్డును అందుకున్నారు. ఫిబ్రవరి 3న బోసీ విమానాశ్రయంలో అపిల్టన్ ప్రయాణిస్తున్న
ప్రైవేట్ విమానం అత్యవసరంగా దింపాల్సి వచ్చినప్పుడు జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు.
అంతకు ముందు 2004 సంవత్సరంలో కూడా జరిగిన ఘోర విమానప్రమాదం నుంచి తృటిలో
ఆయన తప్పించుకున్నారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో అపిల్టన్ తలకు, ఊపిరితిత్తులకు,
వెనె్నముకకు గాయాలు అయ్యాయి. కారు రేస్‌లు అంటే ఆయనకు సరదా. 2006
సంవత్సరంలో 1,047 మైళ్లు 25 గంటల 25 నిముషాల్లో నడిపి రికార్డును సృష్టించాడు.
సెమీ కండక్టర్‌లో చేసిన నిరంతర పరిశోధనల వల్ల ఎక్కువ సామర్థ్యంకల ఫ్లాష్ మెమరీ
అపిల్టన్ నేతృత్వంలో తయారు చేయడం సాధ్యమైంది. మైక్రో టెక్నాలజీని ఫ్లాష్‌మెమరీ
పుణికిపుచ్చుకోవడంవల్ల ఎంతకాలమైనా డేటా భద్రంగా నిలువ ఉంచుకునే చిన్ని పెరిఫిరల్స్
ఉత్పత్తి సాధ్యం అయింది.
ఇదీ నిరసనే..!?
నిరసన వ్యక్తం చేయడానికి ఇంటర్‌నెట్ వేదిక అయింది. ప్రభుత్వ విధానాలను విమర్శించాలన్నా,
నిరసన వ్యక్తం చేయాలన్నా అందుకు ప్రత్యేక ఏర్పాట్లు కావాలి. మంది మార్బలం కావాలి.
అనుకున్నది అనుకున్నట్లు ఇతరులకు తెలియజెప్పాలంటే ఏచేయాలి? అని యూరోపియన్
యూనియన్ పరిధిలోని సల్వేనియా యువత అనుకుంది. చాలా కాలంగా ఎసిటిఎ అనే కొత్త
చట్టాన్ని దేశంలో అనుమతి చేయవద్దని యువత చేస్తున్న నిరసనను ప్రభుత్వం
ప్రట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో సల్వేనియా కంప్యూటర్ మేధావులకు చిత్రమైన ఆలోచన
వచ్చింది. దేశంలోని వ్యాపార లావాదేవీలు ఒక రోజు స్తంభిపజేయాలి. ఇందుకోసం ఆయా సంస్థల
సిబ్బందితో ఆందోళన చేయించడం సాధ్యం అయ్యే పనిలా కనిపించలేదు. వ్యాపార లావాదేవీలు
నిర్వహించడానికి ఉపయోగపడే బ్యాంకులు పనిచేయకుండా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన
వచ్చింది. వెంటనే ఏన్‌ఏల్ బ్యాంకును హాక్ చేసారు. గతవారం ప్రారంభంలో ఒకరోజు బ్యాంకు
హాక్ చేసారు. బ్యాంకు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయిన తరువాత దేశం చేస్తున్న ఒప్పందానికి
వ్యతిరేకంగా తాము ఇలా నిరసన చర్యకు పాల్పడినట్లు ప్రకటించారు. సుమారు రెండు గంటల
పాటు బ్యాంకు కార్యకలాపాలు స్తంభించాయి. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని దర్యాఫ్తుకోసం
ఒక రోజు మొత్తం లావాదేవీలను నిలిపివేసాయి. ఎసిటిఎ చట్టాన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు
చేస్తున్నారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ లోని 22 దేశాలలో మేజార్టీ దేశాలు
ఆమోదం తెలిపాయి. గత సంవత్సరం అక్టోబర్ 1 నాటికి ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్,
సింగపూర్, దక్షిణ కొరియా అమెరికా ఎసిటిఎచట్టాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చాయి.
ఇదేవిధంగా అరబ్ దేశాలకు చెందిన యువకుడు ఒకరు నిరసన గతంలో నిరసన వ్యక్తంచేసాడు.
ట్విట్టర్‌లో కోర్టు తీర్పులుసామాజిక నెట్‌వర్క్ సైట్లను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించవచ్చని
బ్రిటన్ సుప్రీంకోర్టు ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఇందుకోసం ద్దఆఆఔ:// ఆతీఖఆఆళూ.ష్యౄ
/శ్రీడఖఔళౄళ్ళ్యఖూఆ అని మైక్రోబ్లాగింగ్ ప్రారంబించింది. ట్విట్టర్ అంటే వదంతులు, అవాస్తవాలు
అన్న నానుడి వ్యాపిస్తున్న ఈ రోజుల్లో దీనిని ఒక ప్రయోజనానికి ఉపయోగించవచ్చని యుకె
సుప్రీంకోర్టు భావించింది. ఒక వ్యాపారం ప్రారంభిస్తే దాని అభివృద్ధి అంచలంచలుగా ఎదగాలంటే
ఒక వదంతిని వ్యాప్తి చేయాలనే మూఢాచారాన్ని ట్విట్టర్ వేదికగా చాలా మంది ఉపయోగించు
కుంటున్నారు. గానకోకిల మృతి చెందారంటూ ఎవరో ఒకరు చేసిన ట్విట్టర్ పోస్టింగ్‌కు కుప్పతెప్పలుగా
వస్తున్న సంతాప సందేశాలను జవాబుగా నాకేం కాలేదు... అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం
లేదు... నేను జీవించే ఉన్నానంటూ స్వయంగా ఇటు మీడియాలో అటు ఇంటర్‌నెట్ ట్విట్టర్‌లో
ప్రకటించుకోవాల్సి వచ్చిన విషయం విధితమే. ఇలాంటి సంఘటనలు ఒక మనదేశంలోనే కాదు
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే 2009లో కోర్టు ముందుకు వచ్చిన వికీలీక్స్
ఉదంతాన్ని దృష్టిపెట్టుకునే ట్విట్ ప్రారంభించినట్లు బోగట్టా. అంతేకాకుండా ట్విట్టర్‌లో ట్విట్ చేస్తే
అది ఒక వాస్తవం యధార్థం అన్న చందంగా ఉండాలని బ్రిటన్ సుప్రీంకోర్టు భావించింది. కోర్టులో
వచ్చిన తీర్పులను వెంట వెంటనే ట్విటర్‌లో ఉంచడానికి వీలుగా సుప్రీంకోర్టు కార్యాలయంలోనే
ఒక విభాగం ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ మైక్రోబ్లాగ్‌లో సమాచారం చూడాలంటే ముందుగా
వివరాలు నమోదు చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తరువాతగానీ ట్విట్టర్‌లో
పోస్ట్‌చేసిన సమాచారం కనిపించదు. ఒక మారు నమోదు చేసుకున్నవారు ఎప్పటికప్పుడు కోర్టు
తీర్పులు, సంబంధిత తాజా సమాచారం ట్విట్టర్ ద్వారా అందుతుంది.రాజధానిలో సైబర్ నేరాలు
హైదరాబాద్‌లో సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కేసులను
కూడా సైబర్ పోలీసులు వెంటవెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రమేయంలేకుండా మెయిల్‌లో ఉన్న
ఫొటోలను ఎడిట్ చేసి బ్లాగ్‌లలో అశ్లీలంగా ఉంచుతున్నారంటూ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన
ఫిర్యాదుతో బెంగుళూరులో ఉన్న నిందితుని పట్టుకుని కటకటాలకు పంపారు. ఒకే కంపెనీలో
సహోద్యోగిగా పనిచేసిన ఒక వ్యక్తి వివిధ సందర్భాలలో మహిళా ఉద్యోగిని తీసిన చిత్రాలను ఇందుకు
ఉపయోగించినట్లుగా సైబర్ పోలీసులు కనుగొన్నారు. తొలుత ఫిర్యాదు వచ్చిన వెంటనే ఫొటోలు
ఎక్కడి నుంచి పోస్టింగ్ అవుతున్నాయో పరిశీలించారు. ఇ-మెయిల్ ఎక్కడనుంచి లాగిన్ చేస్తున్నారన్న
అంశంపై దృష్టిపెట్టారు. ఫిర్యాదు చేసిన అమ్మయి పనిచేస్తున్న కార్యాలయంలో గతంలో పనిచేసిన
సిబ్బంది వివరాలు వాకబ్ చేశారు. ఐపి చిరునామా ఆధారంగా గతంలో హైదరాబాద్‌లో పనిచేసిన
యువకుని గుర్తించారు. విచారణ జరపగా తన ప్రేమను తిరస్కరించినందకు గాను అమెను
అప్రతిష్ఠపాలు చేయడానికే అమె మెయిల్ ఐడి ముందుగా తెలిసి ఉండటంచేత దానిని హాక్
చేశానని తెలిపాడు. మెయిల్‌లో ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు అశ్లీల చిత్రాలకు గ్రాపిక్ చేస్తూ
వచ్చానని, ఇలా చేసిన ఫొటోలను ఆమె మెయిల్‌లో ఉన్న ఇతర చిరునామాలకు మెయిల్
చేశానని వెల్లడించారు. ఇలాంటి నేరాలు ఎక్కువగా నమోదు అవుతుండటంతో మెయిల్ చిరునామా
హాక్ కాకుండా చూసుకోవడానికి చిన్న చిన్న చిట్కాలను ఆచరించాలి. ముఖ్యంగా మెయిల్
చిరునామాలు, ఇతర ఇంటర్‌నెట్ ఎకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు
మార్చుకోవాలి. మెయిల్ లాగిన్ అయిన వెంటనే గతంలో లాగిన అయిన సమయం నమోదు
అయ్యేలా చూసుకోవాలి. కొత్తగా వచ్చిన మెయిల్స్‌ను ఇతరులు చదివినట్లు అనుమానం వస్తే
  • వెంటనే మెయిల్ చిరునామాను కొంతకాలం బ్లాక్ చేయాలి.

No comments: