12 Feb 2012

కేథోడ్‌ రే ట్యూబ్‌

కేథోడ్‌ రే ట్యూబ్‌

కంప్యూ టర్‌, టెలివిజన్‌ స్క్రీన్‌లలో, రాడార్‌లలో మనం చూసేది కేథోడ్‌ రే ట్యూబే వల్లనే. మొదట దీనిని క్రూక్స్‌ అనే జర్మన్‌ శాస్త్రవేత్త కేథోడ్‌ డైయోడ్‌ ట్యూబ్‌గా రూపొందించాడు. దీనిని ఫర్డినార్డ్‌ బ్రౌను అనే జర్మన్‌ భౌతిక శాస్త్రవేత్త 1897లో మార్పు చేసి, ఇప్పడు మనం చూస్తున్న కేథోడ్‌ రే ట్యూబ్‌ ప్రాథమిక నమూనాను తయారుచేశాడు. కేథోడ్‌ రే ట్యూబ్‌ ఏ గాలీ లేని వాక్యూమ్‌ ట్యూబ్‌. వీటిలో ఎలక్ట్రాన్లను విడుదల చేయడానికి ఒక ఎలక్ట్రాన్‌ గన్‌ ఉంటుంది. ఇది ఆ ట్యూబ్‌లోని ఫ్లోరిసెంట్‌ స్క్రీన్‌ పై పడి వెలుగునిస్తూ బొమ్మలను, వివిధ ఆకారాలను సృష్టిస్తుంది. ఇది విద్యుత్‌ తరంగాలుగా (అసిలోస్కోప్‌), బొమ్మలుగా, రాడార్‌ టార్గెట్‌లుగా లేదా ఇతరంగా కనిపించవచ్చు. రాంట్‌జన్‌కు ఈ ట్యూబే ఎక్స్‌-రేలను కనుగొనడానికి తోడ్పడింది.

No comments: