సెమి కండక్టర్‌లు..

డయోడ్లు..
దీనిలో ఒకే ఒక పి-ఎన్ జంక్షన్ ఉంటుంది. పి-ఎన్ కలిసే చోట డిప్లీషన్ జోన్ (లోటు జరిగే ప్రాంతం) ఏర్పడుతుంది. పి-ఎన్ జంక్షన్‌లో ఎన్ టైప్ ప్రాంతం నుండి పి టైప్ ప్రాంతానికి విద్యుత్ (ఎలక్ట్రాన్లు) వెళ్లడాన్ని నిరోధిస్తుంది. కానీ, పి నుండి ఎన్‌కు విద్యుత్ ప్రవాహాన్ని అనుమతిస్తుంది. దీనిని ఫార్వర్డ్ బయాస్ (ముందుకు పోవడం) డయోడ్ అంటారు. ఎన్-పి టైప్ జంక్షన్‌ను రివర్స్ బయాస్ (వెనక్కు రావడం) డయోడ్ అంటారు. వీటిని ఫొటో డయోడ్‌లని కూడా అంటారు. డయోడ్లు ఘన రూపంలో ఉంటూ విద్యుత్ ప్రవాహానికి దోహదపడతాయి. వీటిని వేర్వేరుగా కానీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (ఐసి) రూపంలోగాని తయారుచేస్తారు. ఒక ఐసిలో రెండు నుండి 10 లక్షల అర్ధ వాహక జంక్షన్లు ఉండవచ్చు.
ట్రాన్సిస్టర్...
ట్రాన్సిస్టర్‌లను రెండు పి-ఎన్ జంక్షన్లతో రూపొందిస్తారు. ఎన్-పి-ఎన్ లేక పి-ఎన్-పి రూపంలో ఇవి ఉండవచ్చు. వీటిలో మధ్యభాగం చాలా సన్నగా ఉంటుంది. మిగతా రెండు భాగాలు మందంగా ఉంటూ ఎమిటర్, కలెక్టర్‌గా వ్యవహరిస్తాయి. కలెక్టర్, ఎమిటర్ భాగాల్లో పెద్ద మొత్తంలో విద్యుదుత్పత్తి అవుతుంది. వీటిలో విద్యుదుత్పత్తి బేస్ ఎమిటర్ విద్యుత్ మీద ఆధారపడి ఉంటుంది.
వివిధ అవసరాలకు ఉపయోగపడే విధంగా అర్ధ వాహక పదార్థంలో (సిలికాన్ లేక జర్మేనియం లేక ఇతర పదార్థాలు) ఉత్ప్రేరకంగా ఇతర పదార్థాలను కలిపి వీటిని రూపొందిస్తున్నారు.
No comments:
Post a Comment