సూక్ష్మ గాలిమర బ్యాటరీ ఛార్జర్
Share
విజ్ఞానవీచిక డెస్క్
Wed, 19 Jan 2011, IST
-
ప్రజల నుండి ప్రజల కొరకు..
నిత్యజీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పెరుగుతుంది.
సెల్‌ఫోన్లు, వాక్‌మెన్లు, బ్యాటరీతో నడిచే ఆటబొమ్మలు, చేతిలో వినియోగించే
కంప్యూటర్లు, ల్యాబ్‌ట్యాప్‌లు... ఇలాఎన్నో మన జీవితంలో
భాగస్వాములవుతున్నాయి. వీటికి బ్యాటరీలను కొని, వాడాలంటే ఖర్చు ఎక్కువే.
ఇప్పుడు ఈ బ్యాటరీలను మామూలు విద్యుత్‌తో ఛార్జి చేసి, వినియోగిస్తున్నాం.
దీనికి ప్రత్యామ్నాయంగా విశాఖపట్టణం జిల్లా నుంచి ఎన్.వి.సత్యనారాయణ అనే
యువకుడు సూక్ష్మ గాలిమరతో పనిచేసే బ్యాటరీ ఛార్జర్‌ను రూపొందించాడు
(చిత్రాలను చూడండి).

ఈయన
రూపొందించిన గాలిమర కేవలం 3.5 × 3 సెం.మీ.ల వెడల్పు కలిగి ఉంది. మామూలు
గాలితో ఇది తిరుగుతూ ఒక యాంపియర్ విద్యుత్ వరకూ(12 ఓల్టులు) ఉత్పత్తి
చేస్తుంది. ఈ విద్యుత్‌తో మామూలు బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రానిక్
వస్తువులు పనిచేస్తాయి. విద్యుత్ సౌకర్యం లేనిచోట ఈ యంత్రాన్ని ఉపయోగించి
ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించుకోవచ్చు. విద్యుత్ సంరక్షణకు కూడా ఇది
తోడ్పడుతుంది. స్థానిక ఆవిష్కరణల జాతీయ పోటీల్లో (నేషనల్ ఇన్నోవేషన్స్
ఫౌండేషన్-ఇన్నోవేషన్ ఎట్ గ్రాస్‌రూట్ లెవల్స్- 2002లో) దీనికి రెండవ
బహుమతి కూడా లభించింది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
No comments:
Post a Comment