ఈ ఫొటో ప్రచురణ చైనాని గొప్ప చేయడానికీ కాదు, ఇండియాని తక్కువ చేయడానికీ కాదు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వివిధ అవసరాల కోసం జనం కూడే ఇతర ప్రదేశాల్లో ఒకరిపై ఒకరు పడుతూ, ముందున్న వారిని నెట్టివేస్తూ తానే ముందుకు చేరాలన్న ఆత్రుతలో, తమ దాకా రాదేమో అన్న ఆందోళనతో ఉన్నపుడు, సాధారణంగా ఇటువంటి పరిస్ధితులు కనిపిస్తుంటాయి. అందరికి సరిపడా ఉంది, కనుక అందరికీ అందుతుంది అన్న భరోసా ఉంటే ఈ తోపులాటలు తప్పుతాయి. క్యూలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కావలసింది అందుతుంది అన్న నమ్మకం ఉంటే ముందున్నవాడిని వెనక్కి నెట్టేయాలన్న ఆలోచన రాదు. అలా కాక అవసరమైనవీ, అత్యవసరమైనవీ కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటేనో, అవి అవసరమైనవారు అనేక రెట్లు ఉంటేనో తమ దాకా రాదన్న ఆత్రుత, ఆందోళన ఉదయించడం సహజం. అంటే, ప్రజలకు సౌకర్యాల కల్పన పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉంచగల ప్రభుత్వాలు ఈ పరిస్ధితిని నివారించ గలవు. ప్రజలకు చెందవలసింది కూడా తామే నొక్కేస్తూ ఉన్న పాలకులు ఉన్న భారత దేశంలో ఈ పరిస్ధితి కాకుండా మరొక పరిస్ధితి ఎలా ఉంటుంది? ఈ చిత్రాన్ని ఆ కోణంలో నుండే చూడాలి.
No comments:
Post a Comment