16 Feb 2012

సైన్స్‌ ప్రచారం..


సైన్స్‌ ప్రచారం..

జాతీయ శాస్త్ర, సాంకేతిక సంస్థ, ఆలిండియా రేడియో సహకారంతో 'నిత్యజీవితంలో రసాయనిక శాస్త్రం' అనే అంశంపై 30 నిమిషాల వ్యవధితో 13 ఎపిసోడ్‌లను రూపొందించి, ప్రసారం చేసింది. 'ఆధునిక సైన్సు ఆవిర్భావం' పై మరో 13 ఎపిసోడ్‌ల కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. 'అంతర్జాతీయ భూగ్రహ వార్షికోత్సవ (2008లో)' సందర్భంలో 52 వారాలు ధారావాహిక ప్రసార కార్యక్రమాల్ని నిర్వహించింది. 'అంతర్జాతీయ భౌతికశాస్త్ర దినోత్సవం (2005)' లో భాగంగా 'ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌' విగ్రహాన్ని తిరుపతిలో ఆవిష్కరించింది. 'చెకుముకి' అనే బాలల సైన్స్‌ మ్యాగజైన్‌ను ప్రచురిస్తోంది. 'చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌' పేరుతో ప్రతి సంవత్సరం విజ్ఞానోత్సవాలను నిర్వహిస్తుంది. పేరుకు మాత్రమే ఇది 'టెస్ట్‌' ఆచరణలో ఇదొక 'పిల్లల పండుగ'. తద్వారా పిల్లల్లో పరీక్షలంటే ఉన్న భయాన్ని పోగొడ్తుంది. ప్రతి పండుగలో లక్షలాదిమంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటు న్నారు. జీవితకాలం గుర్తుండే అనుభవం పొందుతున్నారు.
విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని ఇది చేస్తుంది. ప్రధానంగా మూఢవిశ్వాసాలు ప్రబలినప్పుడు వాటిని గురించి ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు అనేక ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రహణం మొర్రి, చంద్ర, సూర్యగ్రహణాలు ఏర్పడినప్పుడు అవగాహనా కార్యక్రమాల్ని ప్రదర్శన రూపాల్లో చేస్తుంది. దొంగబాబాల మోసాలను బట్టబయలుజేస్తూ ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తోంది. సైన్స్‌లో సృజనాత్మకతను జోడించి, బోధించేందుకు ఆ రంగంలోని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగుతులు నిర్వహించింది. సైన్స్‌ బోధనకు తోడ్పడేలా తక్కువ ఖర్చుతో 'సైన్స్‌ కిట్స్‌'ను ప్రచారంలో పెట్టింది. చిన్న పిల్లల్లో సైన్స్‌పట్ల ఆసక్తిని పెంచడానికి 'బాలోత్సవ్‌లు, సృజనోత్సవాలు, బాలమేళాలు' వంటి పండుగలను పెద్దఎత్తున జరుపుతోంది.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments: