బెలూన్ నుండి ఉపగ్రహం వరకూ..
బెలూన్! మరీ అంతరిక్షంలోకి కాకపోయినా, దాని గుమ్మంవరకూ తీసుకువెళ్లే వీలు బెలూన్ కల్పించింది. స్విట్జర్లాండ్‌లో
జన్మించిన బెల్జియన్ భౌతికశాస్త్రవేత్త, అగస్ట్ పికార్(1884-1962) 1930లో ఒక భారీ బెలూన్‌నుతయారుచేశాడు. దాని సాయంతో అతను కాస్మికకిరణాలను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఈకిరణాలను భూమి వాతావరణం పొర అడ్డుకుని,అవి భూమిని ాకకుండా చేస్తుంది. కాబట్టిఅటు వంటి కిరణాల గురించి తెలుసుకోవాలంటే వాతావరణ పొరను దాటి పైకి వెళ్లాల్సి ఉంటుంది. పికార్డ్ న్నో ప్రయాసల కోర్చి, తక్కువ పీడనంలో కూడా మానవులు మామూలుగా ఉండగలిగే గనులను రూపొందించాడు. అటువంటి కాబిన్‌లో అతను 55,563 అడుగుల ఎత్తుకు వెళ్లగలిగాడు! ఇది జరిగింది 1932లో. ఆ మరుసటి ఏడాది సోవియట్ యూనియన్‌కు చెందిన బెలూనిస్టులు పికార్డ్ నమూనా సాయంతో 60,700 అడుగుల ఎత్తు ఎగరగలిగారు. అదే ఏడాది
చివర్లో అమెరికన్లు బెలూన్లను ఉపయోగించి 61,221 అడుగుల ఎత్తుకు ఎగిరారు. బెలూన్‌లు మానవులను గాలిలోకి
తీసుకెళ్లగలుగుతున్నాయి గానీ, స్ట్రాటోస్ఫియర్ పొరను దాటి పైకి వెళ్లలేకపోయాయి. ఎందుకంటే, వాటిని పైకి తీసుకెళ్లడానికి భూమి
వాతావరణం సహాయపడాలి. దాంతో అంతరిక్షం అంతు చూడాలనుకున్న వారికి నిరాశే మిగిలింది. అయితే ప్రపంచయుద్ధ సమయంలో వాడిన వి2 రాకెట్లను మెరుగుపరిచి, వాతావరణ పొరల అవతల వరకూ పంపే ప్రయత్నాలను ముమ్మరం
చేశారు. యుద్ధం తరువాత 'సౌండింగ్ రాకెట్' తయారైంది. భూమి వాతావరణ పొరల అవతల శబ్దాలను తెలుసుకోడానికి ఈ తరహా
రాకెట్లను రూపొందించారు. ఈ రాకెట్లు గంటకు 5000 మైళ్ల వేగంతో దూసుకు పోగలిగేవి. ఇవి దాదాపు 20 మైళ్ల ఎత్తుకు
వెళ్లేటప్పటికి వాటి ఇంధనం అయిపోయేది. అయినా, ఆ చలన వేగంతో అవి ఓ వంద మైళ్ల వరకూ సాగిపోయేవి. ఇక ఆ తరువాత
ఆ రాకెట్ నేలమీద పడిపోయేది. దాంతో ఆ రాకెట్‌తో పాటు పైకి వెళ్లిన పరికరాన్ని ఎలాగోలా సురక్షితంగా నేలమీద పడేలా చేయవలసి వచ్చింది. ఆ దశలో చాలా ఎత్తుకు దూసుకెళ్లగల రాకెట్ తయారుచెయ్య డమే కాకుండా భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని వెళ్లగలిగే వేగాన్ని అందుకోవడం ముఖ్యమైన లక్ష్యంగా ఉండేది. ఒకవేళ అటువంటి వేగాన్ని సాధించగలిగితే భూమి చుట్టూ తిరిగే
ఉపగ్రహాలని తయారుచేసే వీలు చిక్కుతుంది. అటువంటి వేగాన్ని అందుకోవడానికంటే ముందే వి2 తరహా రాకెట్లలో ఇంధనం
అయిపోయేది. ఆ సమయంలో మళ్లీ గోడార్డ్ ఆలోచన ఉపయోగపడింది. గోడార్డ్ డిజైన్లో అంచెలంచెల రాకెట్ ఉంది. అసలు రాకెట్‌నే ఇంధనం మోసుకెళ్లే పెట్టెలుగా చేస్తే, చివరి (కింది నుంచి మొదటిది) ఇంధనం పెట్టి ఖాళీ అవ్వగానే కింద పడిపోతూ, దాని పైనున్న పెట్టెను అంటిస్తుంది. అలా అంచెలంచెలుగా, ఖాళీ అయిన పెట్టెలు పడిపోతూ, రాకెట్‌ను మరింత తేలికగా చేస్తూ చాలా దూరం వెళ్లవచ్చు! (ఇప్పటికీ ఈ తరహా రాకెట్లే వాడుకలో ఉన్నాయి). 1950 వ దశకంలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే
ఆలోచన ఊపందుకుంది. అందుకు అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ తమ సంసిద్ధతను తెలియజేశాయి. అయితే
అమెరికాకు ఆశ్చర్యం కలిగేలా సోవియట్ యూనియన్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి, అలా చేసిన తొలి దేశం అయ్యింది. రష్యన్ భాషలో
'ఉపగ్రహం' అనే అర్థం ఉన్న 'స్పుత్నిక్' పదాన్నే ఉపగ్రహానికి పేరుగా పెట్టింది. అక్టోబరు 4, 1957న స్పుత్నిక్-1 అంతరిక్షంలోకి వెళ్లింది. ఆ 83.25 కిలోల ఉపగ్రహం 201 కి.మీ. ఎత్తున గంటకు 28,980 కి.మీ. వేగంతో తిరిగింది. ఈనాటి ఉపగ్రహాలతో పోల్చితే స్పుత్నిక్-1ని చాలా పురాతనమైన దానికిందే జమకట్టాలి. అంతరిక్షం నుండి అప్పుడప్పుడూ ఒక రేడియో సిగ్నల్ ఇవ్వడం మినహా మరేం చేసేది కాదు. అసలు స్పుత్నిక్ చేయడానిక్కూడా ఏమీ పనిలేదు. కాని అది చేసింది ఒకటుంది. అంతరిక్ష యుగానికి పునాది వేసింది. అంతరిక్ష యుగం జన్మించింది. అంతరిక్ష పోటీలు ప్రారంభమయ్యాయి.
No comments:
Post a Comment