మనుషులే ఎందుకు మాట్లాడతారు?

గతంలో ఇదే శీర్షికలో చాలాసార్లు ఈ భూమి ఆవిర్భావం, జీవావిర్భావం గురించి చర్చించుకున్నాం. ఎక్కువ పరిశోధనల ప్రకారం మానవజాతి చరిత్ర ఈ భూమ్మీద కేవలం 20 లక్షల సంవత్సరాల నుంచే. జీవిత గమనాన్ని, విధానాన్ని బట్టి జీవులు వయ్యక్తిక జీవులు (solitoryx organisms), సామూహిక జీవులు (colonised organisms) అని రెండురకాలు. సింహము, కప్ప, ఈగ, కాకి, కుక్క వంటి జీవజాతులు కేవలం సంతానోత్పత్తి సమ యంలో తప్ప మిగిలిన సమయాల్లో వేటికవే స్వతంత్రంగా ఏకాకులుగా ఉంటాయి. కానీ తేనెటీగలు, చీమలు, పావురాల వంటి కొన్నిరకాల పక్షులు, కోతులు, మానవులు సామూహి కంగా ఉంటాయి. ఇలాంటి సామూహిక జీవనం సాగించే ప్రక్రియ మానవ పరిణామక్రమంలో ఓ విడదీయ రాని అంశం. మిగిలిన జంతువులలాగే మనిషికీ, మనిషికిలాగే మిగిలిన చాలా జంతువులకూ నోరు, శబ్దపేటిక (larynx), స్వరపేటిక (pharynx), ముక్కు, ఊపిరితిత్తులు ఉంటాయి. అందువల్ల మనిషిలాగే జంతువులూ శబ్దాలను చేయగలవు. మనిషీ మొదట్లో కేవలం శబ్దాల (sounds)ను మాత్రమే చేయగలిగేవాడు.
మిగిలినజీవుల్లాగా మనిషీ ప్రకృతితో ఘర్షణ పడేవాడు. ఇది జీవికి, ప్రకృతికి మధ్య ఉన్న ఘర్షణ. ఇలా ప్రతి వ్యవస్థలోనూ అంతరంగికంగా ఘర్షించుకొనే అంశాలుంటా యనీ, ఘర్షించుకొంటూనే అవి తిరిగి కలిసే ఉంటాయనీ ఈ ఘర్షణలూ వివిధరూపాల్లో ఉంటాయనీ కొన్ని ఘర్షణలు ప్రధాన ఘర్షణలుగానూ, మరికొన్ని ద్వితీయశ్రేణి ఘర్షణలు గానూ ఉంటాయనీ, ఓ నిర్ణీత సమయంలో ఏదో ఒక ఘర్షణ రూపం ప్రధానఘర్షణగా పొంగుకొస్తుందనీ 'గతితార్కిక భౌతికవాదం (dialectical materialism)µ అనే అద్భుతమైన తాత్వికవాదం చెబుతుంది. ఇలా మనిషీ ప్రకృతి తో ఘర్షించుకొంటూ పరిణామం చెందాడు. ఈ పరిణామక్ర మంలో మరింత జ్ఞాపకశక్తిని, సమన్వయాన్ని, త్రిమితీయ దృష్టి (binocular stereo vision) ని, త్రిమితీయ శ్రవణశక్తి (stereophonic auditory capability)ని సంతరించు కొన్నాడు. మిగిలిన జంతువులకన్నా బాగా పొందికగా శబ్దపేటిక, స్వరపేటిక, ఊపిరితిత్తులలో గాలిని నింపుకొని వదిలే ఉఛ్వాసనిశ్వాసాల సామర్థ్యం, నాలుక, అంగిటి, నాసికా నిర్మాణం ఏర్పడ్డాయి. అందువల్ల మిగిలిన జంతువులకన్నా ఎక్కువగా శబ్ద విస్తారం (sou nd range) పెరిగింది. అంటే అతి తక్కువ పౌనఃపున్యం (frequency) నుంచి అతి ఎక్కువ పౌనఃపున్యం వరకూ విశాల విస్తారంగల పౌనః పున్యాల శబ్దాన్ని ఇవ్వగలిగాడు. కానీ శబ్దం వేరు, మాట్లాడడం వేరు. వేర్వేరు జంతువులకు వేర్వేరు శబ్దాలు న్నట్టే మనిషికీ ఒక విధమైన శబ్ధం ఉండేది. అంతేతప్ప భాష ఉండేది కాదు.

మనిషి చేతికున్న అంగుళీయకత (digital anatomy) అనే స్వతఃలక్షణం. ప్రకృతి సిద్ధమైన పదార్థాల నుంచి పరికరాల (tools) రూపకల్పనకు తోడ్పడింది. ఆ క్రమంలో తన సామూహిక తోటిజీవు లకు సంకేతాలను వివిధరకాలుగా తెలియజేయ డానికి అవసరమైన చేతులిపుడు 'ఖాళీ'గా లేవు. పనిలోపడ్డాయి. చేతినిండా పని. ఈ పరిస్థితి ఇతర జంతువులకు లేవు. దానికితోడు తన తోటి మను షులకు తనకు కంటిచూపుల కలయిక (eye contact) లేని పరిస్థితులూ ముంచుకొచ్చాయి. ఉదా: ఒకరు చెట్లగుబుర్లో ఉన్నారు కాబట్టి సంజ్ఞలు చేసి సంకేతాలివ్వడానికి అతడు కన్పించడం లేదు. మరొ కరు చెట్లెక్కి ఎక్కడో చిటారు కొమ్మల్లో పళ్లు కోస్తు న్నాడు. కిందున్నవాడు దూరంగా ఓ పులిని చూశా డు. తాను పరిగెత్తాలి. పైవాణ్ణి దిగొద్దని చెప్పాలి. కానీ చెట్లమాటున పైవాడు కన్పించడంలేదు. ఇలాం టి పరిస్థితులతో పాటు చేతులకు పని పడడంతో గొంతు శబ్దాలే మార్చుతూ భాష ఏర్పడింది. చాలా మంది సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనిషికి భాష ఏర్పడి 50 వేల ఏళ్లే అయ్యింది. ధ్వని మార్పులతో భాష భూమిపై ఏర్పడి, దాదాపు లక్ష ఏళ్లైంది. అంటే మనిషి ఏర్పడిన దాదాపు 19 లక్షల ఏళ్ల పాటు 'బా, బే, మే, మా...' అంటూ ముక్కుకు, నోటికి సంబంధించిన శబ్దమే ఉండేదన్న మాట. దవడలు, పెదాలు, దంతాలు, నాలుక, అంగిటి (palate), శబ్దపేటిక, ముక్కు, స్వరపేటిక, ఊపిరితిత్తుల శ్వాసనాళం (trachia), కొండనాలుక వంటి శబ్దావయవాల సమన్వయం (co-ordination) ఉండేదికాదు.
కేవలం పరిమాణాత్మక మార్పులు ప్రోదవుతూ గుణాత్మకమార్పునకు దారి తీస్తాయన్న గతితార్కికపద్ధతిలోనే శబ్దం భాషగా మారింది. త్రిమితీయ శబ్ద గ్రాహ్యానికి అది బాగా కలిసొచ్చింది. క్రమేపీ తర్వాతితరాలకు, భవిష్యత్తుకు, తర్వాతిరోజులకు భాష ద్వారా నిఖార్సయిన సమాచారాన్ని కుదురుగా ఉంచుకొనేందుకు లిపి (రషతీఱజ్ూ) ఏర్పడింది. లిఖితపూర్వక భాష ఏర్పడి మానవజాతి చరిత్రలో కేవలం 10 వేల ఏళ్లలోపేనన్నది శాస్త్రజ్ఞుల ఉవాచ. కాబట్టి మనిషి ఆవిర్భావంతో పాటు బీజాక్షరాలతో కూడిన భాష రాలేదన్న విషయాన్ని, అది కేవలం గతితార్కికపద్ధతిలో శ్రమతో సమన్వయంగా ఏర్పడిందన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇతర జంతువులు మానవుడు చేసే శ్రమను చేయ లేవు. పైగా వాటి నోటి నిర్మాణం అనుకూలంగా లేదు. అందు కే అవి మాట్లాడలేవు. సామూహిక జీవనం, సామాజిక జీవ నం, పరిసరాల పరిశీలన ఇవన్నీ భాషకు దారితీసిన పరిస్థితు లని ఋజువు చేయడానికి పలువురు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసినట్లు మన చరిత్ర నిరూపిస్తుంది.
No comments:
Post a Comment