16 Feb 2012

కాంతులీనే పుష్పాల తయారీ!


కాంతులీనే పుష్పాల తయారీ!

ఎటువంటి అదనపు హంగులూ, ఆర్భాటాలూ, హంగామా లేకుండానే పూలు మనల్నీ, కీటకాలనీ ఆకర్షిస్తాయి. ఇప్పుడు వాటికి కొత్తగా కాంతిని వెదజల్లే లక్షణాన్ని సైన్సు ఆపాదిస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన 'మార్క్‌ టెస్టర్‌' అనే శాస్త్రవేత్త ఒక ప్రత్యేక ఫార్ములాను రూపొం దించాడు. 'గలాసియ' అనే పూల నుండి ఒక పదార్థాన్ని సేకరించి, దాన్ని ఇతర పూలపై జల్లి, వాటిని ఒక ప్రత్యేక పరికరం సమీపంలో ఉంచితే చాలు. పూలూ, ఆకులూ కాంతితో మెరిసిపోతాయి. అంతే కాకుండా మనకి అవసరమైన మేరకు కాంతిని అదుపుచేసుకునే వీలూ ఉందట. పైగా, పూలు ఎండిపోయిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు ఆ రసాయనం ప్రభావం చూపుతుందట. పూల నుండి సేకరించిన ఈ రసాయన పదార్థం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవట. ఒకవేళ ప్రమాదవశాత్తూ ఇది మీదపడితే నీళ్ళతో శుభ్రం గా కడిగేసుకోవచ్చట. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇటువంటి పరి కరం, రసాయనం అమ్మకానికి ఉన్నాయట. త్వరలోనే అన్ని దేశాలలో ఇది లభిస్తుందని ఆశిద్దాం.

No comments: