15 Feb 2012

ఆదాయపు పన్ను - నిబంధనలు


ఆదాయపు పన్ను - నిబంధనలు

కేంద్ర ప్రభుత్వ ఆదాయపు పన్ను చట్టం -1961లోని సెక్షన్‌ 192 ప్రకారం ప్రతి ఉద్యోగీ తన వేతన ఆదాయాన్నిబట్టి ప్రతి సంవత్సరమూ ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2011- 12 ఆర్థిక సంవత్సరం పన్నెండు నెలల వేతనము, ఇతర ఆదాయాల మొత్తంపై ఆదాయపు పన్ను నిబంధనలననుసరించి పన్నును మదింపు చేయాల్సిన అవసరం వుంటుంది.
2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక చట్టం 2011 ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయపు పన్ను నిబంధనలలో కింది మార్పులు చేశారు. మిగిలినవన్నీ పాతవే వర్తిస్తాయి.
* ఉద్యోగులకు ఆదాయపు పన్ను రాయితీని, ఆదాయ గరిష్ట పరిమితిని రూ.1,60,000 నుండి రూ.1,80,000 వరకు పెంచారు.
* స్త్రీలకు ఆదాయపు పన్ను రాయతీ విషయంలో ఆదాయం గరిష్ట పరిమితిలో ఎలాంటి మార్పూలేదు.(రూ.1,90,000)
* సీనియర్‌ సిటిజన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించారు. అదే విధంగా వీరికి ఆదాయపు పన్ను రాయితీని, ఆదాయం గరిష్ట పరిమితిని రూ.2,40,000 నుండి రూ.2,50,000 వరకు పెంచారు.
* అయితే ఈ ఆర్థిక సంవత్సరం నుండి కొత్తగా వెరీ సీనియర్‌ సిటిజన్స్‌ అనే కేటగిరీలోనికి వస్తారు. వీరికి సంవత్సర ఆదాయం రూ.5,00,000 వరకు ఆదాయపు పన్నును మినహాయించారు.
వేతన ఆదాయం
ఎ) కింది అంశాలకు చెందిన ఆదాయాలు వేతనాదాయంగా పరిగణిస్తారు:
1.వేతనములు: పే, డి.ఏ., ఇంటి అద్దె అలవెన్సు(కొన్ని షరతులకు లోబడి), సి.సి.ఏ., తాత్కాలిక భృతి, ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు. 2. కమీషన్లు, 3 వేతన బకాయిలు, వేతన అడ్వాన్సులు, 4) పెన్షన్‌, 5) సరెండర్‌ లీవు, 6 బోనస్‌,7) అదనపు అద్దెలో తగ్గింపు మొదలగునవి.
బి) వేతనంగా పరిగణించని అంశాలు
1. గ్రాట్యుటీ, 2) కమ్యుటెడ్‌ పెన్షన్‌, 3) ఎల్‌టిసి, 4) పిఎఫ్‌ చెల్లింపులు, 5) టూర్‌/ ట్రాన్స్‌ఫర్‌ టిఏ/డిఏ, 6 రిటైరైన పిదప లీవ్‌ ఎన్‌క్యాషమెంట్‌, 7) కన్వేయన్స్‌ అలవెన్స్‌, 8) మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, 9) ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌.
ఇంటి అద్దె అలవెన్స్‌ మినహాయింపు : 10 (13ఎ)
ఉద్యోగి అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే ఇంటి అద్దె మినహాయింపుగా ఈ క్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతనాదాయం నుండి తగ్గుతుంది.
ఎ) వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్సు
బి) వేతనంలో 10 శాతంకంటే అదనంగా చెల్లించిన ఇంటి అద్దె
సి) వేతనంలో 40 శాతం.
గమనిక: 1.ఇంటి అద్దె చెల్లిస్తున్న వారు నెలకు రూ.3,000/-ఆపైన వుంటే రశీదు జతపరచాలి. అంతకన్నా తక్కువ చెల్లిస్తున్న వారు ఎలాంటి రశీదూ జతపర్చనవసరం లేదు. కానీ అద్దె చెల్లిస్తున్నట్లు అండర ్‌టేకింగ్‌ ఇవ్వాలి. 2. సొంత ఇల్లు లేదా అద్దెలేని వసతి గృహంలో నివసిస్తున్న వారికి ఇంటి అద్దె మినహాయింపు వర్తించదు.
Income from self occpied house property:(సెక్షన్‌ 24)
1. గృహ నిర్మాణానికి అప్పు తీసుకొని సొంతంగా నివాసమున్నట్లయితే అప్పుపై వడ్డీ రూ.1,50,000 వరకు మినహాయింపు ఉంది.
2) అద్దెకు ఇచ్చినట్లయితే, వాస్తవంగా పొందే అద్దె ఆదాయం నుండి (-) నీటి పన్ను, ఇంటి పన్నుల ఆదాయంలో 30% వరకు మరమ్మత్తులు, మెయింటెనెన్స్‌ ఖర్చులను తీసి వేసి, మిగిలిన మొత్తాన్ని ఆదాయంలో చూపాలి.
తగ్గింపులు((Dedutions)): ఉద్యోగి స్థూల ఆదాయం నుండి హెచ్‌ఆర్‌ఎ మినహాయింపు పోను మిగిలిన ఆదాయం నుండి కింది తగ్గింపులు అనుమతిస్తారు.
వృత్తిపన్ను : సెక్షన్‌ 16(iii): ఉద్యోగి చెల్లిస్తున్న వృత్తి పన్ను మొత్తం
చాప్టర్‌ VI-A కింద తగ్గింపు
ఎ) సెక్షన్‌ 80సి ప్రకారం ఈ కింది తగ్గింపులు అనుమతిస్తారు.
1) ఎల్‌ఐసి ప్రీమియం (పాలసీ మొత్తంలో 20% గరిష్ట పరిమితితో)
2) పిఎఫ్‌ చందా
3) నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ (ఙఱఱఱవ ఇష్యూ)
4) యుటిఐ యూనిట్‌ లింక్‌డ్‌ ఇన్స్యూరెన్స్‌ ప్లాన్‌)
5) ఎల్‌ఐసి ధనరక్ష మ్యూచువల్‌ ఫండ్‌
6) అనుమతించిన మ్యూచువల్‌ ఫండ్‌ (సెక్షన్‌ 10 (23డి)
7) గృహ నిర్మాణానికి/కొనగోలుకు ప్రభుత్వం/ బ్యాంక్‌లు/ ఎల్‌ఐసి/ నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు నుండి పొందిన అప్పులను తీర్చడానికి తిరిగి చెల్లించిన అసలు
8) ట్యూషన్‌ లింక్‌డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లలో పెట్టుబడి
9) ఈక్విటీ లింక్‌డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లలో పెట్టుబడి
10) అనుమతించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌
11) పెన్షన్‌ ఫండ్‌
12) పోస్టాఫీస్‌లో లేదా ఏదైనా షెడ్యూల్‌ బ్యాంక్‌లో కనీసం ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ చేసిన టర్మ్‌ డిపాజిట్లు.
13) సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, 2004
బి) కేంద్ర ప్రభుత్వం అనుమతించిన న్యూ పెన్షన్‌ స్కీమ్‌కు చెల్లించిన కంట్రిబ్యూషన్‌ (సెక్షన్‌ 80 సిసిసి) 1 లక్ష వరకూ ఉదా: ఎల్‌ఐసి జీవన సురక్ష
సి) నూతన పెన్షన్‌ స్కీమ్‌కు వేతనములలో చెల్లించిన 10% ప్రీమియం (సెక్షన్‌ 80 సిసిడి) (1)
డి) నూతన పెన్షన్‌ స్కీమ్‌కు ప్రభుత్వం చెల్లించిన వేతనంలో 10% మ్యాచింగ్‌ కంట్రిబ్యూషన్‌ (సెక్షన్‌)80 సిసిడి (2)
గమనిక: 1. 80 సి, 80 సిసిసి, 80 సిసిడి(1)ల క్రింద తగ్గింపు మొత్తం రూ 1,00,000 గరిష్ట పరిమితికి లోబడి వుంటుంది. (సెక్షన్‌ 80 సిసిఇ)
2. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌లో పెట్టిన పెట్టుబడికి రూ,20,000 వరకు అదనంగా మినహాయింపు లభిస్తుంది. (సెక్షన్‌ 80 సిసిఎఫ్‌)
ఇ) మెడికల్‌ ఇనూస్య్‌రెన్స్‌ ప్రీమియం (సెక్షన్‌ 80 )
1.ఉద్యోగి, ఉద్యోగి భార్య/భర్త, ఆధారిత పిల్లలు తల్లిదండ్రులకోసం చెల్లించిన ప్రీమియంకు మొత్తం రూ.15,000 గరిష్ట పరిమితితో తగ్గింపు.
2) సీనియర్‌ సిటిజన్‌, భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకోసం చెల్లించిన ప్రీమియం మొత్తం రూ.20,000 గరిష్ట పరిమితితో తగ్గింపు.
ఎఫ్‌) వికలాంగులైన ఆధారితుల ఖర్చు (సెక్షన్‌ 80 డిడి)
మానసిక/ శారీరక వైకల్యం గల ఆధారితుల వైద్యం, పోషణ మరియు నిర్వహణకోసం చేసిన ఖర్చులను 1)40 శాతం కంటే ఎక్కువ వైకల్యం వుంటే రూ.50,000 గరిష్ట పరిమితితో, 2) 80% కంటే ఎక్కువ వైకల్యం వుంటే రూ.1,00,000 గరిష్ట పరిమితితో తగ్గిస్తారు.
జి) వైద్య చికిత్సలకోసం ఖర్చులు (సెక్షన్‌ 80 డిడిబి)
ఉద్యోగి సొంత విషయంలోగాని, ఆధారపడిన కుటుంబీకులకుగాని కేన్సర్‌, ఎయిడ్స్‌ లాంటి తీవ్ర రోగాల చికిత్సకోసం చేసిన వాస్తవ వైద్య ఖర్చుల నుండి రూ.40,000 వరకు, సీనియర్‌ సిటిజన్స్‌కైతే రూ. 60,000 వరకు మినహాయింపు గలదు. ఈ సదుపాయం పొందగోరువారు నిర్ణీత ఫారం 10(×)లో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పిజి డిగ్రీ కలిగిన స్సెషలిస్టు నుండి వైద్య ధ్రువ పత్రము జతపరచాలి.
హెచ్‌) ఎడ్యుకేషన్‌ లోను (సెక్షన్‌ 80 ఇ)
ఉద్యోగి, భార్య/భర్త, పిల్లల చదువులకోసం ఏదైనా చారిటబుల్స్‌, ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీని పూర్తిగా ఆదాయం నుండి ఎనిమిదేళ్ల వరకు లేదా అప్పు తీరే వరకు ఏది ముందైతే అది తగ్గిస్తారు.
ఐ) విరాళములు (సెక్షన్‌ 80 జి)
1. ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి, ప్రధానమంత్రి భూకంప సహాయ నిధి, జాతీయ మత సామరస్య నిధి, యూనివర్శిటీలు లేదా అర్హత వున్న జాతీయ విద్యా సంస్థలకు ఇచ్చిన విరాళాలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తుఫాను సహాయ నిధికి, జిల్లా సాక్షరతా సమితికి, జాతీయ క్రీడల నిధికి ఇచ్చిన విరాళాలు, మొత్తం, ఆదాయపు పన్ను నుండి 100 శాతం తగ్గిస్తారు.
2. ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి, జాతీయ బాలల నిధి, రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, ఇందిరాగాంధీ స్మారకనిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ప్రత్యేక మినహాయింపు పొందిన దేవాలయం, మసీదు, చర్చీలవంటి మత సంస్థలకు, మసీదుల పునర్నిర్మాణానికి, రిపేర్లకు ఇచ్చిన విరాళములో 50 శాతం ఆదాయం నుండి తగ్గిస్తారు.
జె) వికలాంగుడైన ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు(సెక్షన్‌ 80యు)
వైద్యాధికారి ఇచ్చిన ధ్రువపత్రమును బట్టి 40 శాతంకంటే ఎక్కువ వైకల్యంగల వారికి రూ.50,000 వరకు, 80 శాతంకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి గరిష్టంగా రూ.1,00,000 మినహాయింపు గలదు.
పన్ను విధించే ఆదాయం
ఉద్యోగి మొత్తం ఆదాయం నుండి హెచ్‌ఆర్‌ఎ మినహాయింపు, పైన పేర్కొన్న తగ్గింపులుపోను మిగిలిన ఆదాయపు పన్ను విధించదగు ఆదాయంగా పరిగణిస్తారు. కింది రేట్ల ప్రకారం ఈ ఆదాయంపై పన్ను లెక్కించవలసి వుంటుంది.

No comments: