15 Feb 2012

ఆధునిక అవకాశాలకు ఫారెన్‌ లాంగ్వేజ్‌


ఆధునిక అవకాశాలకు ఫారెన్‌ లాంగ్వేజ్‌

అవకాశాల కల్పనలో నేడు ఫారెన్‌ లాంగ్వేజ్‌ పాత్ర కీలకంగా మారుతోంది. ఇందులో పట్టు సాధిస్తే చాలు. ఏ కెరీర్లో ప్రవేశించిన ఎదిగే దారులు దగ్గరైనట్లే అంటున్నారు భాషా నిపుణులు. అది వాస్తవమే ఎందుకంటే ఏ రంగమైనా అభివృద్ధి దిశగా పయనిస్తోందంటే అక్కడ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అందుకే దీనికంత ప్రాధాన్యత. అనువాదం, ఇంటర్‌ప్రిటేషన్‌, టీచింగ్‌, రీసెర్చ్‌లలో దేశ, విదేశాల్లో కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలతోపాటు ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, రాయబార కార్యాలయాలు, మల్టీ నేషనల్‌ కంపెనీలు, కాల్‌సెంటర్స్‌, టూరిజం సంస్థల్లో అవకాశాలు కోకొల్లలు. స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, అరబిక్‌, పర్షియన్‌, పోర్చుగీస్‌, చైనీస్‌, జపనీస్‌, రష్యన్‌ వంటి విదేశీ భాషలకు ఇప్పుడు మంచి డిమాండ్‌ వుంది.
ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నకొద్దీ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా కంపెనీలు, సంస్థల్థు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలను విస్తరిస్తున్నాయి. వాటిలో రెగ్యులర్‌, అవుట్‌ సోర్సింగ్‌, ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్సాహవంతులైనా యువతీ యువకులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా దేశ విదేశాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి నేటి యువత ఆసక్తి కనబరుస్తోంది. ఫారెన్‌ లాంగ్వేజ్‌ వచ్చిన ఉద్యోగులకు కంపెనీలు ఆన్‌లైట్‌ అవకాశాలు కల్పిస్తున్నాయి. మరోవైపు వర్తకం, పర్యాటకం, ఆతిథ్యం విస్తరిస్తున్నాయి. యూరప్‌, ఆసియా దేశాల మధ్య ఐటీ వ్యాపారం పెద్దఎత్తున విస్తరిస్తోంది. ముఖ్యంగా యూరొపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి ఇండియన్‌ ఐటి, బిపిఓ, కెపిఓ కంపెనీలకు పెద్దఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టుల సమాచారం తెలుసుకోవటం, నిబంధనల పత్రాలను, ఒప్పంద పత్రాలను తర్జమా చేయటం, విదేశీ కంపెనీ ప్రతినిధులతో, క్లయింట్స్‌తో మాట్లాడటం...ఇలా అనేక రకాల అవసరాలు కంపెనీలకు పెరిగిపోయాయి. తాజాగా ఓ సర్వే అంచనా ప్రకారం. భారతదేశంలో ప్రస్తుతం1,60,000 మంది భాషా నిపుణుల అవసరం వుందని తేలింది. అంటే విదేశీ భాషలు మాట్లాడగలిగే ప్రతి నిపుణుడికీ ప్రస్తుతం ఏదోఒక మంచి హోదాగల ఉద్యోగం సిద్ధంగా ఉందనడంలో సందేహం లేదు.
ఏ దేశానికైనా, ఏ రంగంలో అయినా ఏదో ఒక అవసరం, కొరత ఎప్పుడూ ఉంటూనే వుంటుంది. ఆ కొరత తీరాలంటే....ఇతర దేశాల సహకారం అనివార్యం. ఉదాహరణకు చైనాలో ఆంగ్ల భాషను బోధించే వారి కొరత చాలా ఎక్కువ. జపాన్‌కు ఇంజనీర్లు, మలేషియాకు ఉపాధ్యాయులు, అమెరికాకు నర్సులు బాగా అవసరం. విదేశీ సంస్థల కార్యాలయాలు భారత్‌లోనూ, భారత్‌కు చెందిన సంస్థల కార్యాలయాలు విదేశాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. అక్కడి వాళ్లకు మన భాష, మనవాళ్లకు అక్కడి భాష తెలియదు. ఈ కొరత తీర్చడంలో విదేశీ భాష వచ్చినవాళ్లు ఎంతో అవసరం.
వేతనాలు : ప్రారంభంలో నెలకు రూ.15,000 వరకూ సంపాదించొచ్చు. ట్రాన్స్‌లేటర్లు పదానికి 60 పైసలు నుంచీ 5 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఐటీ, బిపిఓ రంగాల్లో పనిచేసేవాళ్లకు ప్రారంభంలో రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. బోధనా రంగంలో అడుగుపెట్టిన వాళ్లకు ప్రారంభంలో నెలకు 10,000 నుంచి 25,000 వరకూ ఉంటుంది. పేరొందిన ఇంటర్‌ప్రిటేటర్లు గంటకు రూ.4 వేలకు పైగా సంపాదించొచ్చు. రాయబార కార్యాలయాల్లో పనిచేస్తే రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది.
విదేశీ భాషల్లో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు డిప్లొమాటిక్‌ సర్వీసెస్‌, బోధన రంగం, ట్రాన్స్‌లేటర్స్‌ ఇన్‌ ఇండిస్టీస్‌, ప్రభుత్వ, పరిశోధనా రంగాలు, ఇంటర్‌ప్రిటేటర్‌, టూరిస్ట్‌ గైడ్స్‌, ఎయిర్‌హోస్టెస్‌, ప్రముఖ హోటళ్ల తరుపున ప్రతినిధులు, ఫ్రీలాన్సర్స్‌, పిఆర్‌వోలతోపాటు బిజినెస్‌రంగంలో ఎగ్జిక్యూటివ్స్‌, పర్సనల్‌ మేనేజర్స్‌, స్టెనోగ్రఫీ, సెక్రటరీ, ప్రొఫెసర్లు, విదేశీవిద్య సమన్వయ కర్తలు, పాఠ్యసపుస్తకాల రచయితలు, న్యాయస్థానాల్లో అనువాదకులు, ఫెడరల్‌ ఏజెన్సీలు, ట్రావెల్‌ రైటర్లు, టెక్నికల్‌ ట్రాన్స్‌లేటర్లు, సాఫ్ట్‌వేర్‌ డిజైనర్స్‌, టెక్నికల్‌ సపోర్ట్స్‌, స్పెషలిస్టులు, సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌, వెబ్‌ లోకలైజేషన్‌ స్పెషలిస్టులు ఇలా...ఎన్నోరకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం : అరబిక్‌, ఫ్రెంచ్‌, పర్షియన్‌ కోర్సులు రెగ్యులర్‌ విధానంలో అందిస్తోంది.

No comments: