10 Mar 2012

జనవిజ్ఞాన వేదిక

                                                      జనవిజ్ఞాన వేదిక

                                     గౌరవ ప్రధానోపాధ్యయులు/ఉపాధ్యాయులకు

మిత్రులారా !

            1988 ఫిబ్రవరి 28న స్థాపించిన జనవిజ్ఞాన వేదిక శాస్త్రీయ దృక్పదాన్ని ప్రజలలో పెంచడానికి కృషి చేస్తూ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొంది.25వ రజతోత్సవ సంవత్సరాన్ని ఈ 2012 సంవత్సరం జరుపుకొంటుందీ జనవిజ్ఞాన వేదిక. ఇంత ఎదమడానికి మధ్య తరగతి వర్గమేధావులు, ప్రజల ఆదరించారు. జె.వి.వి. లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిది. ఈ కృషి రాబోవు కాలంలో కొనసాగించాలని ఆశిస్తున్నాము. ఈ సందర్బంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాము. వీటి విజయవంతంలో మీ సూచనలు, సలహాలతోపాటు మీ సహకారాన్ని కోరుతున్నాము.

@     విద్యార్ధులలో శాస్త్రీయ దృక్పదం పెంచేదాని కోసం విద్యార్ధి చెకుముకి పత్రిక
        (సంవత్సర చందా రూ!! 130/- లు) మీ పాఠశాల గ్రంధాలయ నిధుల నుండి
        కట్టే ప్రయత్నం చేయగలరు.

@    2012 జూన్ 6 ఉదయం 7.30 గం!! ల లోపు శుక్ర గ్రహణం
       ( సూర్యునికి అడ్డంగా శుక్ర గ్రహం వస్తుంది ) ఇది ఖగోళ అద్బుతం.
       దీని గురించి విధ్యార్థులకు చెప్పాలి ( దీనికి సంబందించిన నోట్ పంపిస్తాము )

@    ప్రతి పాఠశాల గోడ బైట ఆరోగ్య దీపిక బోర్డు ఏర్పాటు చేసి ప్రతి వారం ఆరోగ్య
       సూత్రాలు విద్యర్ధులతో వ్రాయించాలి.

@   ప్రముఖ శాస్త్రవేత్తల పుట్టిన రోజులను పాఠశాలలో నిర్వహించాలి. దీనిని ఉదయం
      పాఠశాలప్రార్ధన సమయం లో నిర్వహించవచ్చు. ( శాస్త్రవేత్తల పుట్టిన రోజుల
      క్యాలెండర్ను పాఠశాలలకు పంపిస్తాము )

@   ప్రముఖ శాస్త్రవేత్తల పుట్టిన రోజులను పాఠశాలలో నిర్వహించాలి. దీనిని ఉదయం
      పాఠశాల ప్రార్ధన సమయం లో నిర్వహించవచ్చు. ( శాస్త్రవేత్తల పుట్టిన రోజుల
      క్యాలెండర్ను పాఠశాలలకు పంపిస్తాము )

@   ప్రతి పాఠశాలలో సైన్స్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ సైన్స్
      విభాగం నుండి పాఠశాలకు ప్రయోగాలతో కూడిన మెటీరియల్ ఉచితంగా పంపిస్తారు.

      ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి మాతో సహకరించగలరని ఆశిస్తున్నాము



                                                జనవిజ్ఞాన వేదిక
                                             గుంటూరు జిల్లా శాఖ

     అధ్యక్షులు                             ప్రధాన కార్యదర్శి                         ఆర్ధిక కార్యదర్శి
డా !! బి. సాంబిరెడ్డి                   ఎన్. వెంకటేశ్వర్లు                  యం.ఉదయ్ భాస్కర్      
    9440262072                           9492084527                          9441394911

No comments: