29 Jan 2012

Wednesday, 25 January 2012

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌తో విద్యుత్‌ ఉత్పత్తి


సోలార్‌ పవర్‌ ప్లాంట్‌తో విద్యుత్‌ ఉత్పత్తి Share ప్రజాశక్తి విలేకరి Tue, 4 Oct 2011, IST రాష్ట్రంలోనే తొలి సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నూతనంగా సౌరశక్తి విద్యుత్‌ కేంద్రం 1 మెగావాట్‌ కెపాసిటీతో ప్రారంభం పర్యావరణ పరిరక్షణకు దోహదం దేశంలోనే అరుదైన, ప్రసిద్ధి గాంచిన సోలార్‌ పుటోవల్‌టెక్‌ పవర్‌ప్లాంట్‌ (సౌరశక్తి విద్యుత్‌ కేంద్రం) ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సారిగా షాద్‌నగర్‌ ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి జరగుతోంది. అది కూడా ఒక మెగావాట్‌ విద్యుత్‌ సామర్థ్యంతో షాద్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ ద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది. ఇటీవలే ప్రారంభించిన ఈ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు రాకతో విద్యుత్‌ రంగంలో ఇక్కడ కొత్త శకం ఆరంభమైనట్లుగా చెప్పవచ్చు. గతంలో ఇదే ప్రాంతంలో చెత్త ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని చేసే సెల్‌కో విద్యుత్‌ పరిశ్రమ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సోలార్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుతో మరోసారి విద్యుత్‌ రంగంలో అందరి దృష్టి ఈ ప్లాంటుపై పడింది. పర్యావరణానికి ముప్పు వాటిల్లని ఈ ప్లాంట్‌ ప్రజలకు ఉపయోగకరమే. థర్మల్‌ ప్రాజెక్టుల మాదిరిగా విచ్చలవిడిగా కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేయడం, కలుషిత నీరు, గాలి వచ్చే అవకాశాలు ఈ ప్లాంట్‌కు ఉండవు. ఎలాంటి హానీ జరగకుండా కేవలం సౌరశక్తితో విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రయోజనాత్మకమైన ప్లాంట్‌గా దీనిని చెప్పవచ్చు. ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ గురించి తెలుసుకోవాల్సిందే. సోలార్‌ పవర్‌ ప్రత్యేకత ఒక మెగావాట్‌ సామర్థ్యంతో స్థాపించిన ఈ పవర్‌ప్లాంట్‌లో 'సోలార్‌ మాడ్యూల్‌' (ప్లేట్స్‌)ను వాడతారు. ఒక మాడ్యూల్‌ 230 ఓల్ట్స్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. మొత్తం పవర్‌ ప్లాంట్‌లో 4,400 మాడ్యూల్స్‌ ఉంటాయి. వీటిని భూమిపై దిమ్మెలను ఏర్పాటు చేసి వాటిపై అమర్చుతారు. వీటి ద్వారా సమకూరే సౌర శక్తి విద్యుత్‌ను సేకరించేందుకు తీగలను కంట్రోల్‌ రూమ్‌కు అమర్చుతారు. కంట్రోల్‌ రూమ్‌లో 500 కిలోవాల్ట్స్‌ చొప్పున రెండు ఇన్వైటర్‌లకు డి.సి ద్వారా విద్యుత్‌ను పంపుతారు. ఇక ఇన్వైటర్‌ల ద్వారా ఎ.సిగా కాంప్యాక్ట్‌ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుంది. 300 వోల్ట్స్‌ నుంచి 11 కెవి ద్వారా ఈ సబ్‌స్టేషన్‌ నుండే విద్యుత్‌ను బయటికి పంపిణీ చేయవచ్చు. టాటా బిపి సోలార్‌ కంపెనీ ద్వారా తయారైన వీటి వస్తువులు బెంగళూరులో తయారు చేస్తారు. వాతావరణం అనుకూలంగా ఉంటే రోజుకు కనీసం 4 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. వాతావరణం కొంత అనుకూలంగా లేకపోతే రెండు వేల యూనిట్లకుపైగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. పవర్‌ప్లాంట్‌లో వినియోగించే విద్యుత్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్లాంట్‌లో ప్రత్యేకమైన సోలార్‌ మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఆటోమెటిక్‌గా సూర్యాస్తమయానికే ప్లాంట్‌లో విద్యుత్‌ దీపాలు వెలుగుతాయి. అదే విధంగా సూర్యోదయం కల్లా విద్యుత్‌ దీపాలు ఆరిపోయే విధానం ఇందులో అమర్చబడి ఉండటం విశేషం. ఈ ప్లాంట్‌ రక్షణ కోసం కూడా ఏర్పాట్లు చేశారు. పిడుగులు ప్లాంట్‌పై పడకుండా 'లైట్నింగ్‌ అరెస్టర్‌' ను ఏర్పాటు చేశారు. పిడుగులు పడే సమయంలో వాటిని పొడవైన రాడార్‌లు ప్లాంట్‌కు నష్టం కలగకుండా వాటిని స్వీకరించి భూమిలో నిక్షిప్తం చేస్తాయి. షాద్‌నగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు సరఫరా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న మెగావాట్‌ సామర్థ్యం గల విద్యుత్‌ను కాంప్యాక్ట్‌ సబ్‌స్టేషన్‌ ద్వారా షాద్‌నగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు సరఫరా అవుతుంది. సోలార్‌ పవర్‌కు సంబంధించి యూనిట్‌కు రూ.5 చొప్పున ట్రాన్స్‌కో శాఖ వారు ఖరీదు చేయాల్సి ఉంటుందని ఎపి ట్రాన్స్‌కో డైరెక్టర్‌ చెన్నారెడ్డి, జిల్లా ఎస్‌.ఇ సదాశివరెడ్డి 'ప్రజాశకి'్తకి తెలిపారు. సంవత్సరానికి కనీసం 15 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఈ పవర్‌ప్లాంట్‌కు ఉందని చెప్పారు. ఈ పవర్‌ప్లాంట్‌ వ్యవ స్థాపకులు రామకృష్ణ ఇండిస్టీస్‌ అధినేత కావడం విశేషం. రూ.16 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. ప్లాంట్‌లో పనిచేసేందుకు సిబ్బంది అవసరం కూడా పెద్దగా ఉండదని టాటా బిపికి సంబంధించిన ప్రొజెక్ట్‌ ఇంజనీర్‌ ఆశీష్‌వర్మ ప్రజాశక్తికి వివరించారు.

No comments: