9 Feb 2012

పరిశోధనలు - గుర్తింపు

పరిశోధనలు - గుర్తింపు


  • 23/01/2012
‘ముప్ఫయి ఏళ్లు నిండకముందే సైన్సుకు తన మహత్తర పరిశోధన ఫలితాలను అందించలేని వ్యక్తి, ఆ తర్వాత మరేమీ చేయలేడు’-అన్నాడు ఆల్బర్ట్ ఐన్‌స్టైన్. అతని కాలంలో భౌతిక శాస్త్ర రంగం అలాగుండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. 1900 మొదలు 2008 వరకు భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాలకుగాను ఇచ్చిన 525 నోబెల్ బహుమతులను ఈ మధ్య విశే్లషించారు. క్వాంటం మెకానిక్స్ (అది కూడా 1920, 1930 దశకాలలో) తప్ప పెద్ద వయసు వారే గొప్ప పరిశోధన ఫలితాలను అందించినట్లు ఆ విశే్లషణలో తెలిసింది. సిద్ధాంతం గురించి ఆలోచనలు చేయడంలో యువకులకు మంచి చురుకుదనం ఉంటుంది. కానీ, పరిశోధనలు ప్రయోగాల వైపు ఎక్కువగా మరలుతున్నాయి. ఇక్కడ అనుభవానికి ఎక్కువగా ప్రమేయం ఉంటుంది. ఒక్కొక్క రంగం లోతు, విస్తృతి పెరుగుతున్న కొద్దీ, కొత్త అంశాల గురించి కృషి చేయడానికి ఎక్కువ కాలం పడుతుందని ఈ కొత్త ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్ని రంగాలలో మాత్రం అందరూ అవునన్న ఆలోచనలు ప్రగతికి అడ్డు తగులుతుంటాయి. అందుకే అణు నిర్మాణం లాంటి చోట్ల యువకుల ఆలోచనలు ఎక్కువ ప్రభావం చూపగలుగుతున్నాయి. కాదు! అనడం, పెద్ద వయసు వారికి అంత సులభంగా చేతగాదు. కనుకనే సిద్ధాంతం గురించి కేవలం ఆలోచనే అవసరమైతే యువకులది పైచేయి అవుతుంది.

No comments: