14 Feb 2012

డిఎస్సీ సిలబస్‌లో మార్పులు


డిఎస్సీ సిలబస్‌లో మార్పులు

  • మరింత కఠినంగా ప్రశ్నలు
  • అప్రెంటీస్‌ లేదు
  • అభ్యర్థుల ముంగిట 3 నెలలు
రాష్ట్రంలో 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ - 2012 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ 11,602, లాంగ్వేజ్‌ పండిట్స్‌ 2,000, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ 365, స్కూల్‌ అసిస్టెంట్స్‌ 5,703, మున్సిపల్‌ పాఠశాలల్లో అన్ని ఖాళీలు కలిపి 1,673 పోస్టులున్నాయి. ఇదే నోటిఫికేషన్‌తో విద్యాశాఖలో సుమారు పదహారేళ్లుగా ఉన్న అప్రంటీస్‌ వ్యవస్ధను రద్దు చేసింది. దీంతో ఇకపై ఉద్యోగాల్లో చేరేవారికి ప్రారంభం నుంచే పూర్తి వేతనం వస్తుంది.డీఎస్సీ - 2012 నోటిఫికేషన్‌ ప్రకారం తొలిసారిగా
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
పోస్టుల వివరాలు
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ 11,602
లాంగ్వేజ్‌ పండిట్స్‌ 2,000
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ 365
స్కూల్‌ అసిస్టెంట్స్‌ 5,703
మున్సిపల్‌ పాఠశాలల్లో
అన్ని ఖాళీలు కలిపి 1,673
మొత్తం పోస్టులు 21,343
అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1862, రంగారెడ్డి జిల్లాలో 1552, తూర్పుగోదావరి జిల్లాలో 1474 పోస్టులను భర్తీ చేయనున్నారు. తక్కువగా కృష్ణా జిల్లాలో 303, గుంటూరు జిల్లాలో 362, కడప జిల్లాలో 263 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరణ
ఫిబ్రవరి 15 నుండి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు స్వీకరణ మార్చి 17 వరకు జరుగుతుంది. ఫీజు మాత్రం మార్చి 16లోగా చెల్లించాలి. దరఖాస్తు ధర కింద రూ. 250లు చెల్లించాలి.
నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు, సిలబస్‌, ఇతర వివరాలకు http://apdsc.cgg.gov.in, www. dseap.gov.in
అర్హతలు
స్కూలు అసిస్టెంట్స్‌ క్యాటగిరిలో గణితం, సైన్స్‌, సోషల్‌ ఉద్యోగాలుంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ పాసై ఉండాలి. అంతకంటే ఎక్కువ విద్యార్హతలున్నవారు కూడా అర్హులే. అయితే సంబంధిత అంశంలో బిఇడి డిగ్రీ తప్పనిసరిగా పాసై ఉండాలి. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌కి ఇంటర్‌ పాసై ఉండాలి. అయితే టీచర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. భాషాపండితులకు ఓరియంటల్‌ డిగ్రీ లేదా బి.ఎ (లిట్‌) ఉండాలి.
పండిట్‌ ట్రైనింగ్‌ లేదా బిఇడి తప్పనిసరి. వ్యాయామోపాధ్యాయులకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లామా గాని, బిపిఇడి గానీ ఉండాలి. అలాగే డిగ్రీ పాసై ఉండాలి.
వయోపరిమితి : వయో పరిమితికి సంబంధించి కటాఫ్‌ జూన్‌ 1, 2012గా నిర్ణయించారు. టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18-39 మధ్య వయసు కలిగి వుండాలి. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ అభ్యర్థులకు 44 సంవత్సరాలవరకు అవకాశం ఉంటుంది. వికలాంగ అభ్యర్థులు 49 సంవత్సరాలు వచ్చినప్పటికీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడడారు.
సిలబస్‌లో మార్పులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నేపధ్యంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ - 2012 సిలబస్‌లో మార్పులు చేసారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల రాత పరీక్షలో ప్రశ్నల సంఖ్యతోపాటు సమయాన్ని తగ్గించారు. కొత్తగా పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ఓ సబ్జెక్ట్‌ను చేర్చారు. ప్రధాన సబ్జెక్ట్‌ల సిలబస్‌ను మరింత కఠినతరం చేసారు. స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో సైకాలజీ,ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించినందున డీఎస్సీ - 2012 రాత పరీక్ష నుండి ఈ సబ్జెక్ట్‌లను తప్పించారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌కు ఆంగ్ల పరిజ్ఞానంపై ప్రశ్నలుంటాయి. ఈసారి ప్రశ్నల స్ధాయిని పదవ తరగతికి పెంచారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్న నేపధ్యంలో ప్రశ్నలను 160కి, మార్కులను 80కి తగ్గించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ : గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పరీక్షలో ఏడవ తరగతి వరకు ప్రశ్నలు అడిగేవారు. ఈసారి ప్రశ్నల స్ధాయిని ఎనిమిదవ తరగతికి పెంచారు.
స్కూల్‌ అసిస్టెంట్స్‌ : స్కూల్‌ అసిస్టెంట్స్‌కి సంబంధించి గణితం, బయలాజికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, సోషల్‌ స్టడీస్‌ పోస్టుల రాత పరీక్ష సిలబస్‌లో మార్పులు జరిగాయి. ఈసారి ప్రశ్నల స్ధాయిని ఇంటర్మీడియట్‌కు పెంచారు. కంటెంట్‌పై 88 ప్రశ్నలుంటాయి. లాంగ్వేజ్‌ పండిట్స్‌ పోస్టుల రాత పరీక్షలోను ప్రశ్నలు ఇదే మాదిరిగా ఉంటాయి.
లాంగ్వేజ్‌ పండిట్స్‌ : లాంగ్వేజ్‌ పండిట్స్‌ గ్రేడ్‌-2 పోస్టుల రాత పరీక్షలోను సిలబస్‌ స్ధాయిని పదవ తరగతికి పెంచారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ : ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ పోస్టుల రాత పరీక్ష ప్రశ్నల సంఖ్యలో మార్పులేదు. మొత్తం 100 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం మూడు గంటలు.
సిలబస్‌-ప్రిపరేషన్‌
స్కూల్‌ అసిస్టెంట్స్‌ : స్కూల్‌ ఆసిస్టెంట్‌ ఉద్యోగాలకుగాను జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, కంటెంట్‌, మెథడాలజీ అంశాలలో ప్రశ్నలు అడుగుతారు.
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ : సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ ఉద్యోగాలకు సంబంధించి జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, ఇంగ్లీషు, ఇండియన్‌ లాంగ్వేజ్‌, గణితం, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌లలో కంటెంట్‌, మెథడాలజీ అంశాలలో ప్రశ్నలు అడుగుతారు.
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ : జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, పదవ తరగతి స్థాయిలో ఇంగ్లీషు సబ్జెక్టు, ప్రిన్సిపుల్స్‌, ఫిలాసఫీ అండ్‌ హిస్టరీ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైకాలజీ, మెటీరియల్స్‌ అండ్‌ మెథడ్స్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, అనాటమీ, ఫిజియాలజీ, కినెసియాలజీ, హెల్త్‌ ఎడ్యుకేషన్‌, సేఫ్టీ ఎడ్యుకేషన్‌, ఫిజియాలజీ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌, ఆఫీిషియేటింగ్‌ అండ్‌ కోచింగ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అంశాలలో ప్రశ్నలు అడుగుతారు.
ప్రిపరేషన్‌ : డీఎస్సీ పరీక్ష అబ్జెక్టివ్‌ పద్దతిలో ఉంటుంది. ఈ పరీక్ష ప్రిపరేషన్‌కి ప్రత్యేకత శ్రద్ద వహించాలి. ఇందులో ప్రతి అధ్యాయమూ, ప్రతి అంశమూ ముఖ్యమైనదే. అన్ని అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. కనుక ప్రిపరేషన్‌ విస్తారంగా ఉండాలి. డీఎస్సీ పరీక్షను ఎదుర్కొనాలంటే కోచింగ్‌ అవసరమని కొందరు, కోచింగ్‌ అవసరం లేదని మరికొందరు అంటుంటారు. అయితే కోచింగ్‌ తీసుకోవడం అనేది అభ్యర్థుల అభిప్రాయాలను బట్టీ ఉంటుంది. కోచింగ్‌లో అయితే ప్రిపరేషన్‌ ఒక క్రమ పద్దతిలో సాగుతుంది. నమూనా ప్రశ్నా పత్రాల సాథన, ఇచ్చిన ప్రశ్నకు సులువు మార్గంలో జవాబును రాబట్టడం, కచ్చితత్వం, వేగం తదితర అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఫలితంగా అభ్యర్థికి రోజూ తను ఎంత వేగంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతున్నాడనే అవగాహన ఏర్పడుతుంది. కోచింగ్‌ లేనివారు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి.
ఏ పరీక్షకైనా సాధనే ముఖ్యం. అందువల్ల కఠోర శ్రమ చేయాలి. అలాగని గంటల గంటలు చదవడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. చదివింది అవగాహన చేసుకోవాలి. రోజుకి ఎన్నిగంటలు చదువుతున్నామనేది కాకుండా ఎంత అవగాహన చేసుకున్నామన్నది ముఖ్యం. సబ్జెక్టులను డివిజన్ల వారీగా విభజించుకుని చదువుకోవాలి. గణితం లాంటి అంశాలకు నోటితో కాకుండా అభ్యాసం చేయాలి. క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం వల్ల వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. దీనికి గాను బేసిక్స్‌ మీద, సూత్రాల మీద పట్టు సాధించాలి.
డీఎస్సీ పరీక్షలో ఒక్క మార్కే భవిష్యత్తును నిర్ధేశిస్తుంది. ఒక్క మార్కే కదా పోయిందని వదిలేస్తే ఒక్కొసారి ఆ ఒక్క మార్కే మన తలరాతను మారుస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇంగ్లీషు సబ్జెక్టుకు సంబంధించి గ్రామర్‌పై, ఒకాబలరీపై పట్టు సాధించాలి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో కరెంట్‌ ఆఫైర్స్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవాలి. విజయవకాశాలు మెరుగవ్వాలంటే ఈ విభాగం కూడా ముఖ్యమే. అందువల్ల రోజూ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ పరిణామాలను గమనిస్తూ ఉండాలి. దానికి సంబంధించి పరీక్షకు ముందు ఓ ఆరు నెలల కాలంలో జరిగిన సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. ఒక దినపత్రికను తీసుకుని అందులో కొత్తగా వచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి. ప్రముఖ వ్యక్తుల మరణాలు, కొత్త ఆవిష్కరణలు, సంభవించిన భూకంపాలు, తుపానులు, అల్ప పీడనాలు, దాడులు, కొత్తగా అమలవుతున్న కమిటీలు, సంస్కరణలు, గ్రంథాలు, అవార్డులు, పురస్కారాలతో పాటు నియామకాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి.
మెథడాలజీకి సంబంధించి అభ్యర్థులు వారి వారి ఉపాధ్యాయ శిక్షణలో నేర్చుకుని ఉంటారు. మెథడాలజీలో ఉన్న అన్ని అంశాలను తుచ తప్పకుండా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
చాలా పోటీ పరీక్షలలో విజయం సాధించిన వారంతా రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించిన వారే. అయితే చాలా మంది అభ్యర్థులంతా రివిజన్‌ చేయగలిగితే సమయానికి సమయం ఆదా అవ్వడమే కాకుండా రాని ప్రశ్నలు గురించి ఆలోచించడానికి కొంత సమయం దొరుకుతుంది.
రాస్తున్న పరీక్షను లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్యగా భావించాలి. ఇదే తమకది చివరి అవకాశంగా భావించాలి. అందువల్ల పోటీ పరీక్షలో తాను నెగ్గుకు రాగలమన్న ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మ విశ్వాసం సాధనతోనే, అభ్యాసంతోనే వృద్ది చెందుతుంది. నిరంతరం శ్రమ చేయాలి. నిరంతర శ్రమ, లక్ష్యాన్ని చేరుకోగలమన్న ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణతో కూడుకున్న అభ్యాసం అభ్యర్థులను విజయపథం వైపు నడిపిస్తాయి.
జిల్లాల వారీగా సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ : 11,602
శ్రీకాకుళం-194, విజయనగరం-89, విశాఖపట్నం-614, తూర్పుగోదావరి-780, పశ్చిమ గోదావరి-815, కృష్ణ-135, గుంటూరు-113, ప్రకాశం-82, నెల్లూరు-293, కడప-141, కర్నూలు-449, అనంతరపురం-734, చిత్తూరు-264, వరంగల్‌-340, ఆదిలాబాద్‌-819, కరీంనగర్‌-451, ఖమ్మం-312, మెదక్‌-926, రంగారెడ్డి-1033, మహబూబ్‌నగర్‌-1254, నల్గొండ- 502, హైదరాబాద్‌-541, నిజామాబాద్‌-721
స్కూల్‌ అసిస్టెంట్స్‌ : 5706
శ్రీకాకుళం-316, విజయనగరం-194, విశాఖపట్నం-97, తూర్పుగోదావరి-487, పశ్చిమగోదావరి-291, కృష్ణ-143, గుంటూరు-215, ప్రకాశం-87, నెల్లూరు-142, కడప-74, కర్నూలు-254, అనంతపురం-222, చిత్తూరు-348, వరంగల్‌-164, ఆదిలాబాద్‌-380, కరీంనగర్‌-241, ఖమ్మం-151, మెదక్‌-308, రంగారెడ్డి-405, మహబూబ్‌నగర్‌-472, నల్లగొండ-261, హైదరాబాద్‌- 202, నిజామాబాద్‌-241
డిఎస్సీకి సంబంధించిన రాత పరీక్షలోని కొంత సిలబస్‌ టెట్‌లో కవర్‌ అవుతున్నందున దానిని తొలగించినట్టు అధికారులు తెలిపారు.
అప్రెంటీస్‌ విధానం రద్దయింది కాబట్టి, ఎంపికైన అభ్యర్థులు నేరుగా పూర్తి వేతనంతో నియామకం పొందుతారు.
దూరవిద్యలో డిగ్రీ, ఆ తర్వాత బిఎడ్‌ చదివి టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు డిఎస్సీ రాయడానికి అర్హులే.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం ప్రాధాన్యం ఉంది. ఈసారి పరీక్షలకు సంబంధించిన సిలబస్‌లో మార్పులు జరగాయి.
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ రాత పరీక్షా విధానం
అంశం ప్రశ్నలు మార్కులు
జనరల్‌ నాలెడ్జ్‌
అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 20 10
పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ 20 10
లాంగ్వేజ్‌-1 (ఇండియన్‌ లాంగ్వేజెస్‌) 18 9
లాంగ్వేజ్‌-2 18 9
కంటెంట్‌
గణితం 18 9
సైన్స్‌ 18 9
సోషల్‌ స్టడీస్‌ 18 9
టీచింగ్‌ మెధడాలజీ 30 15
మొత్తం 160 80
సమయం : 2 గంటల 30 నిమిషాలు
సైన్స్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ కంటెంట్‌ (1-5 తరగతులు), జనరల్‌ సైన్స్‌ (6-7 తరగతులు), ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ (8 తరగతి), సోషల్‌ స్టడీస్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ కంటెంట్‌ (1-5 తరగతులు), సోషల్‌ స్టడీస్‌ (6-7 తరగతులు) అంశాలుంటాయి.
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ రాత పరీక్షా విధానం
అంశం ప్రశ్నలు మార్కులు
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌
కరెంట్‌ అఫైర్స్‌ 20 10
ఇంగ్లిష్‌ (పదవ తరగతి లెవల్‌) 20 10
కంటెంట్‌ ప్రిన్సిపుల్స్‌, ఫిలాసఫీ
అండ్‌ హిస్టరీ 30 15
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌
ఆర్గనైజేషన్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌
ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 24 12
సైకాలజీ, మెటీరియల్స్‌ అండ్‌ మెథడ్స్‌
ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 24 12
అనాటమీ, ఫిజియాలజీ,
కినెసియాలజీ 24 12
హెల్త్‌ ఎడ్యుకేషన్‌,
సేఫ్టీ ఎడ్యుకేషన్‌ అండ్‌
ఫిజియాలజీ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌ 30 15
ఆఫీిషియేటింగ్‌ అండ్‌ కోచింగ్‌
ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 28 14
మొత్తం 200 100
సమయం: 3 గంటలు
స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్షా విధానం
(గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌)
అంశం ప్రశ్నలు మార్కులు
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌
కరెంట్‌ అఫైర్స్‌ 20 10
పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ 20 10
కంటెంట్‌ సబ్జెక్ట్‌
(ఇంటర్మీడియట్‌ లెవల్‌) 88 44
టీచింగ్‌ మెధడాలజీ 32 16
మొత్తం 160 80
సమయం: 2 గంటల 30 నిమిషాలు
స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్షా విధానం
(లాంగ్వేజెస్‌)
అంశం ప్రశ్నలు మార్కులు
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌
కరెంట్‌ అఫైర్స్‌ 20 10
పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ 20 10
కంటెంట్‌ లాంగ్వేజ్‌
(పదవ తరగతి లెవల్‌) 88 44
టీచింగ్‌ మెధడాలజీ 32 16
మొత్తం 160 80
సమయం: 2 గంటల 30 నిమిషాలు
లాంగ్వేజ్‌ పండిట్స్‌ గ్రేడ్‌-2 రాత పరీక్షా విధానం
అంశం ప్రశ్నలు మార్కులు
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌
కరెంట్‌ అఫైర్స్‌ 20 10
పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ 20 10
కంటెంట్‌ లాంగ్వేజ్‌
(ఇంటర్మీడియట్‌ లెవల్‌) 88 44
టీచింగ్‌ మెధడాలజీ 32 16
మొత్తం 160 80
సమయం: 2 గంటల 30 నిమిషాలు

No comments: