టమాటాతో కాన్సర్ నివారణ
Share
విజ్ఞాన వీచిక డెస్క్
Wed, 8 Feb 2012, IST
ఉడకబెట్టిన టమాటాలు కాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టడమే
కాకుండా ప్రొస్టేట్ కాన్సర్ కణాలను నిర్మూలిస్తుందని ఒక భారతీయ
శాస్త్రవేత్తల బృందం తెలిపింది. మృదుల చోప్రా, బృందం కలిసి 'పోర్త్స్
మౌత్' యూనివర్శిటీలో టమాటాలో ఉండే 'లైకోపీన'్ అనే పోషక పదార్థంపై
పరిశోధనలు జరిపారు టమాటాలకి ఎరుపు రంగునిచ్చే ఈ పదార్థం 'లైకోపీన్'. అది
కాన్సర్ కణాలు ఇతరకణాలతో ఏర్పరచుకొనే బంధా లను అడ్డుకుంటుందని ఆ బృందం
కనిపెట్టింది. అందుకు అవసరమైన 'లైకోపీన్' మోతాదును ఉడకబెట్టిన టమాటాలు
తినడం వల్ల పొంద వచ్చు అని చెప్తున్నారు. 'లైకోపీన్' అన్ని ఎరుపురంగు
పళ్ళు, కూరగాయలలో విరివిగా ఉంటుంది. టమాటాలలో ఇది అత్యధికంగా ఉంటుంది.
ఉడికించడం ద్వారా అది మరింత శక్తివంతంగా శరీరానికి అందుతుంది. అందువల్ల
ఉడికించిన టమాటాలను తినడం శ్రేయస్కరం.
No comments:
Post a Comment