4 Feb 2012

'సౌరశక్తి వినియోగంతో నూతన ప్రపంచం'


సౌరశక్తిని వినియోగంలోకి తెస్తే నూతన ప్రపంచం ఆవిష్కృతమవుతుందని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జి రవిబాబు అన్నారు. కానూరు పివిపి సిద్దార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ట్రిపుల్‌ 'ఇ' విభాగం ఆధ్వర్యంలో సౌరశక్తి వినియోగంపై 'సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ ఎనర్జీ' అనే అంశంపై జాతీయస్థ్దాయి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో మున్సిపాల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ జి రవిబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్యుత్‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించవలసిన అవసరముందన్నారు. సోలార్‌ విద్యుత్‌ విని యోగం ద్వారా విజ యవాడ సిటీని సోలార్‌ సిటీగా మార్చాల్సిన అవ సరాన్ని ప్రస్తా వించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న ఐఐటి బొంబాయి ప్రొఫెసర్‌ డా చేతన్‌సింగ్‌ సోలంకి కాలుష్యం వల్ల తలెత్తే పరిణాల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టాటా బిపి సోలార్‌ సీనియర్‌ మేనేజర్‌ ఫణిచంద్ర, ఎన్‌టిటిపిఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ జి కిషోర్‌బాబు తదితరులు పాల్గొని కొత్తగా పరిశ్రమలు స్థాపించాల నుకునే వారికి కావలసిన పరిజ్ఞానాన్ని వివరించారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఎన్‌ఆర్‌ఇడిసిఎపి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ సౌరవిద్యుత్‌ పరికరాలు ఉపయోగించే వారికి అందించే సబ్సిడీలను వివరించారు. ఈ కార్యక్రమంలో మిక్‌ ఎలక్ట్రానిక్‌, టాటా బిపి సోలారు , ఏపియు , విగార్డు పరిశ్రమలు ఎగ్జిబిషన్లో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. 

No comments: